Asianet News TeluguAsianet News Telugu

ఖైరతాబాద్ గణేష్: చిరు వ్యాపారులకు లాభాల పంట

ఖైరతాబాద్ గణేష్ భక్తులకు ప్రతి ఏటా కనువిందు చేస్తోంది. అయితే చిరు వ్యాపారులకు ఖైరతాబాద్ గణేష్ ఆదాయాన్ని ఇస్తున్నాడు.

Rs 10 crore business from khairatabad ganesh
Author
Hyderabad, First Published Sep 12, 2019, 7:42 PM IST

హైదరాబాద్:ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యంతో వ్యాపారులు కుదులైపోతున్నారు. కానీ, గణేష్ నవరాత్రోత్సవాలు హైద్రాబాద్ లో చిరు వ్యాపారులకు కలిసొచ్చింది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం చుట్టూ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం సాగింది.

ఈ నెల 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించిన నవరాత్రి ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం చుట్టూ తాత్కాలికంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకొని వ్యాపారులు కోట్లలో వ్యాపారం చేశారు. ఈ ఏడాది సుమారు రూ. 10 కోట్ల మేరకు వ్యాపారం జరిగిందని ఓ అంచనా.

ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకొనేందుకు వచ్చిన వారంతా స్థానికంగా ఏర్పాటు చేసిన స్ఠాళ్లలో తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.ఈ ప్రాంతంలో ఇక్కడ ప్రతి వస్తువు అందుబాటులో ఉంటుంది.

ముఖ్యంగా మహిళలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి పలు రకాల వస్తువులను విక్రయించారు. గాజులు, మేకప్ కిట్స్, బొట్టు బిళ్లలు వంటివి విక్రయించారు. ప్లాస్టిక్ వస్తువులతో పాటు గృహాలంకరణ వస్తువులను కూడ ఇక్కడ విక్రయించారు.

గణనాధుడిని దర్శించుకొనేందుకు వచ్చిన వారి ఆకలితీర్చేందుకు తినుబండారాల స్టాల్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి. రకరకాల తినుబండారాలను భక్తుల కోసం సిద్దం గా ఉండేవి. వాటిని చూసిన వారు తినకుండా ఉండలేరు. నోరూరించే ఫాస్ట్ పుడ్స్ స్టాల్స్ కూడ వెలిశాయి. 

ఈ ప్రాంతంలో ఇళ్లు ఉన్నవాళ్లు తమ ఇంటి ముందు తాత్కాలికంగా స్టాల్స్ ఏర్పాటు చేసుకొనేందుకు స్థలాలను ఇచ్చేందుకు అంగీకరించడంతో కూడ పెద్ద మొత్తంలో డబ్బులను సంపాదించారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేష్

రూ.17.60 లక్షలకు బాలాపూర్ లడ్డు దక్కించుకొన్న కొలను రాంరెడ్డి

గణేష్ నిమజ్జనం: బాలాపూర్ లడ్డు వేలం చరిత్ర ఇదీ...

ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

Follow Us:
Download App:
  • android
  • ios