హైదరాబాద్: బాలాపూర్ లడ్డూను  కొలను రాంరెడ్డి దక్కించుకొన్నారు. గురువారం నాడు జరిగిన లడ్డు వేలంలో కొలను రాంరెడ్డి దక్కించుకొన్నారు.28మందికి పైగా లడ్డు వేలం పాటలో పాల్గొన్నారు. చివరికి కొలను రాంరెడ్డి ఈ లడ్డును వేలం పాటలో దక్కించుకొన్నారు.

గత ఏడాది కంటే ఈ ఏడాది లక్ష రూపాయాలు అదనంగా లడ్డు ధర పలికింది. లడ్డు వేలం పాటలో పాల్గొన్న వారంతా పోటా పోటీగా లడ్డు ధరను పెంచుకొంటూ పోయారు. దీంతో గత ఏడాది కంటే లక్ష రూపాయాలు అదనంగా ధర పెరిగింది.

బాలాపూర్ లడ్డును అత్యధికంగా ఇప్పటివరకు తొమ్మిది దఫాలు కొలను రాంరెడ్డి కుటుంబీకులు ఈ లడ్డును గెలుచుకొన్నారు. ఈ ఏడాది కొలను రాంరెడ్డి లడ్డును దక్కించుకొనేవరకు వేలం పాటలో పాల్గొన్నారు. గత ఏడాది బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం నేత శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు లడ్డును గెలుచుకొన్నాడు.

ఈ ఏడాది మాత్రం 17.60 లక్షలకు లడ్డును వేలం పాటలో కొలను రాంరెడ్డి దక్కించుకొన్నాడు. వేలం పాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామం అభివృద్ది కోసం ఖర్చు చేస్తారు. 

సంబంధిత వార్తలు

గణేష్ నిమజ్జనం: బాలాపూర్ లడ్డు వేలం చరిత్ర ఇదీ...

ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర