హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. నిమజ్జనాన్ని పురస్కరించుకొని గురువారం నాడు ఉదయాన్నే గణనాధుడికి ఆఖఖరి పూజలను నిర్వహించారు.

హైద్రాబాద్ లో గురువారం నాడు వినాయక విగ్రహల నిమజ్జనాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఖైరతాబాద్ గణేష్ విగ్రహన్ని ఎంత త్వరగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తే ట్రాఫిక్ కు ఇబ్బందులు తప్పుతాయని పోలీసులు భావిస్తున్నారు. గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం చేసేలా పోలీసులు కార్యాచరణను రూపొందించారు.

ఇందులో భాగంగానే ఆఖరి పూజలు అందుకొన్నఏకదంతుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఇవాళ సుమారు 50 వేల విగ్రహలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్ కు వెళ్లే రహదారికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. జంటనగరాల్లోని 50 చోట్ల వినాయక విగ్రహల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.

మరోవైపు జంటనగరాల్లో వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. 32 ప్రాంతాల్లో 93 క్రేన్లు, 134 మొబైల్ క్రేన్లు, 75 జనరేటర్లను ఏర్పాటు చేశారు.  నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు పోలీసులు.మరో వైపు వినాయక నిమజ్జనం సందర్భంగా ఎంజె మార్కెట్ వద్ద ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు.