హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి గురవారం నాడు మధ్యాహ్నం హుస్సేన్ సాగర్ లో గంగమ్మ ఒడికి చేరుకొంది. మధ్యాహ్నం 12 గంటల వరకే  ఈ విగ్రహం నిమజ్జనాన్ని పూర్తి చేయాలని భావించారు. కానీ, గంట ఆలస్యంగా నిమజ్జనాన్ని పూర్తి చేశారు.

ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం పూర్తి చేస్తే వినాయక నిమజ్జన ప్రక్రియ దాదాపుగా సగం పూర్తైనట్టుగా అధికారులు బావిస్తారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం త్వరగా నిమజ్జనం పూర్తి చేయాలని ముందుగానే పోలీసులు ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగానే గురువారం నాడు ఉదయమే పూజను పూర్తి చేసి ఏడుగంటలకే శొోభాయాత్రను ప్రారంభించారు. ఖైరతాబాద్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మార్గం మీదుగా ఖైరతాబాత్ గణేషుడి విగ్రహం హుస్సేన్ సాగర్ కు మధ్యాహ్నం చేరుకొంది.

జపాన్ టెక్నాలజీతో రూపొందించిన ప్రత్యేకమైన క్రేన్ ను ఉపయోగించి ఈ క్రేన్ ను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. సుమారు 40 టన్నులకు పైగా బరువున్న ఈ వినాయక విగ్రహన్ని 200 టన్నుల బరువును కూడ అవలీలగా మోసే భారీ క్రేన్ ను ఉపయోగించి నిమజ్జనం చేశారు.

ఈ భారీ వినాయకుడిని చివరి సారిగా చూసేందుకు భారీగా భక్తులు హుస్సేన్ సాగర్ కు తరలి వచ్చారు. హుస్సేన్ సాగర్ పైన ఏర్పాటు చేసిన ఆరో నెంబర్ క్రేన్ వద్ద ఈ విగ్రహన్ని నిమజ్జనం చేశారు. 

సంబంధిత వార్తలు

రూ.17.60 లక్షలకు బాలాపూర్ లడ్డు దక్కించుకొన్న కొలను రాంరెడ్డి

గణేష్ నిమజ్జనం: బాలాపూర్ లడ్డు వేలం చరిత్ర ఇదీ...

ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర