హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన సంఘటన జరిగింది. స్నేహం ముసుగులో ముగ్గురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన హైదరాబాదులోని కూకట్ పల్లిలో జరిగింది.

జూబ్లీహిల్స్ కు చెందన యువతికి బర్త్ డే కేకులో మత్తు కలిపి ఇచ్చారు. స్పృహ కోల్పోయిన ఆమెపై ముగ్గురు మిత్రులు పశువుల్లా తెగబడ్డారు. విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. అయితే, యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. దాంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. 

తల్లిదండ్రులు నిలదీయడంతో ఆమె అసలు విషయం తెలిసిందే. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు యువకులు జోసెఫ్, రాము, నవీన్ లపై కేసు నమోదు చేశారు.