రాత్రిపూట స్నానం చేయడం వల్ల మన శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా…
స్నానం చేయడం అనేది ప్రతి ఒక్కరికీ రోజువారీ దినచర్య. సాధారణంగా, చాలా మంది ఉదయం స్నానం చేయడానికి ఇష్టపడతారు.కొంతమంది వేసవి కాలంలో రెండు లేదా మూడు సార్లు స్నానం చేస్తారు. మనం స్నానం చేసినప్పుడు, అది మన శరీరం నుండి వేడిని తొలగించడానికి సహాయపడుతుంది. మరి, రాత్రి స్నానం చేస్తే శరీరానికి ఏమి జరుగుతుందో మీకు తెలుసా? చాలా మంది రాత్రిపూట స్నానం చేస్తే జలుబు, జ్వరం వస్తుందని భయపడతారు. కానీ, రాత్రి పడుకునే ముందు స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా...
నాణ్యమైన నిద్ర:
రాత్రి స్నానం చేయడం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది. గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది, ఇది మీరు హ్యాపీగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇది మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. రాత్రంతా మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఒత్తిడి, నిద్రలేమితో బాధపడేవారికి రాత్రి స్నానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
పగలంతా ఆఫీసు పని తో ఒత్తిడి పెరిగి..మన శరీరం అలసిపోయేలా చేస్తుంది. రాత్రిపూట స్నానం చేయడం ఒత్తిడిని తగ్గించడానికి ఒక గొప్ప మార్గం.ఒత్తిడి తగ్గి.. మనస్సును ప్రశాంతంగా అనిపిస్తుంది. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాల ఉద్రిక్తత తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
చర్మ సమస్యలను నివారిస్తుంది:
రాత్రిపూట స్నానం చేయడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు పగటిపూట బయటకు వెళ్ళినప్పుడు, దుమ్ము, ధూళి , చెమట మీ చర్మంపై పేరుకుపోతాయి. రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఈ మలినాలన్నీ తొలగిపోతాయి. చర్మ సమస్యలు నివారిస్తాయి. అలాగే, రాత్రిపూట స్నానం చేయడం వల్ల మీ ముఖం , శరీరం శుభ్రంగా ఉండటం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ నివారించవచ్చు.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది:
వేడి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్, పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడినప్పుడు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాల నొప్పి తగ్గుతుంది. రాత్రిపూట స్నానం చేయడం, ముఖ్యంగా శరీరం అలసిపోయిన రోజులలో, మంచి విశ్రాంతిని అందించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
రాత్రిపూట స్నానం చేయడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. బ్యాక్టీరియా , వైరస్ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ప్రతిరోజూ రాత్రి స్నానం చేసేవారికి జలుబు, ఫ్లూ వచ్చే అవకాశం తక్కువ. కానీ చల్లటి నీటితో స్నానం చేయకుండా ఉండాలి.