Homemade Face Serum: ప్రస్తుతం చాలామంది మెరిసే, మచ్చలేని చర్మం కావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం చాలామంది ఖరీదైన ఫేషియల్ సీరమ్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాంటి సీరమ్‌ను సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

Homemade Face Serum: అందమైన, ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం చాలామంది ఫేషియల్ సీరమ్ వాడుతున్నారు. మార్కెట్లో దొరికే ఫేస్ సీరం ఖరీదైనవి. అలాగే వాటిని కెమికల్స్ తయారు చేస్తారు. అలాంటి వాటిని ఎక్కువ కాలం వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు చేసుకున్న ఫేస్ సీరం వాడటం చర్మ సౌందర్యానికి మేలు. నేచురల్ ఫేస్ సీరంలో చర్మానికి పోషణనిచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి ముఖంపై మచ్చ లేకుండా, మెరిసేలా చేస్తాయి.  చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అలాంటి ఫేషియల్ సీరం ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. 

కావలసినవి:

  • 1 చెంచా కలబంద గుజ్జు
  • 1 చెంచా గులాబీ నీళ్ళు
  • 5 చుక్కలు టీ ట్రీ ఆయిల్ (జిడ్డు చర్మం అయితే) లేదా లావెండర్ ఆయిల్ (అన్ని రకాల చర్మాలకీ)
  • 1/2 చెంచా గ్లిజరిన్ (పొడి చర్మానికి)
  • 1 విటమిన్ E ఆయిల్ క్యాప్సూల్
  • చిన్న గాజు సీసా లేదా డ్రాపర్ సీసా (స్టోరేజ్ కోసం)

తయారీ విధానం:

1. ముందుగా ఒక శుభ్రమైన గిన్నెను తీసుకుని, అందులో కలబంద గుజ్జు, గులాబీ నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.  

2. ఈ మిశ్రమంలో గ్లిజరిన్, విటమిన్ E క్యాప్సూల్ వేయాలి.

3. తర్వాత టీ ట్రీ ఆయిల్ లేదా లావెండర్ ఆయిల్ చుక్కలు వేసి బాగా కలపాలి.

4. మిశ్రమం మెత్తగా అయ్యాక డ్రాపర్ సీసాలో నింపాలి.

5. ఈ సీరం ఫ్రిజ్ లో 7-10 రోజులు నిల్వ ఉంటుంది.

వాడే విధానం:

రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మైల్డ్ ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకుని తుడుచుకోవాలి. తర్వాత ముఖానికి 2-3 చుక్కలు సీరం వేసి మెల్లగా మసాజ్ చేయాలి. ముఖ్యంగా నుదురు, బుగ్గలు, ముక్కు, గడ్డం మీద అప్లై చేసి, మసాజ్ చేయాలి. దీని మీద మాయిశ్చరైజర్ అప్లై చేయకూడదు. 

నేచురల్ ఫేస్ సీరం ప్రయోజనాలు:

  • చర్మం తేమగా ఉంటుంది
  • మచ్చలు, మొటిమల మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది
  • యాంటీఆక్సిడెంట్స్ వల్ల ముడతలు తగ్గుతాయి
  • ముఖానికి సహజమైన నిగారింపు వస్తుంది.