Skin Care: ఈ టిప్స్ చాలు.. వర్షాకాలంలో నిగనిగలాడే చర్మం మీ సొంతం..
health-life Jun 12 2025
Author: Rajesh K Image Credits:freepik AI
Telugu
రోజుకు రెండు సార్లు
వర్షాకాలంలో చర్మంపై దుమ్ము, ధూళి, చెమట పేరుకుపోతాయి. కాబట్టి రోజుకు రెండుసార్లు సున్నితమైన, సబ్బు లేని ఫేస్ వాష్ వాడండి. ఇది చర్మం సహజ pHని సమతుల్యంగా ఉంచుతుంది.
Image credits: freepik AI
Telugu
మాయిశ్చరైజర్ తప్పనిసరి
వర్షాకాలంలో కూడా మాయిశ్చరైజర్ తప్పనిసరి. చర్మాన్ని తేమగా ఉంచేది ఎంచుకోండి. హైలురోనిక్ యాసిడ్ ఉన్న ఉత్పత్తులు ఎంచుకోవడం మేలు. ఏవైనా చర్మ సమస్య ఉంటే వైద్యుల్ని సంప్రదించండి.
Image credits: freepik AI
Telugu
ఎక్స్‌ఫోలియేషన్
వర్షాకాలంలో చర్మంపై ఉన్న మృతకణాలు తొలగించడం తప్పనిసరి. ఇందుకోసం తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్ లేదా ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు ఉన్నవాటిని ఎంచుకోండి. వారానికి 1 లేదా 2 సార్లు వాడితే చాలు
Image credits: instagram
Telugu
ఎండ నుంచి రక్షణ
వర్షాకాలంలో కూడా చర్మానికి ఎండ నుంచి రక్షణ అవసరం. మబ్బుగా ఉన్నా యూవీ కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ కాలంలో కూడా తప్పకుండా సన్‌స్క్రీన్ రాసుకోవాలి.
Image credits: pinterest
Telugu
క్లెన్సింగ్, టోనింగ్:
చర్మంపై పేరుకున్న జిడ్డు, మళినాలు తొలగించడానికి తక్కువ పీహెచ్ ఉన్న క్లెన్సర్, టోనర్స్ వాడండి. దానివల్ల పీహెచ్ నియంత్రణలో ఉండి చర్మ రంద్రాలు తక్కువగా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu
బ్యాక్టీరియాపెరుగుదల
తడి బట్టలు, తడి చెప్పులు/బూట్లలో బ్యాక్టీరియాపెరుగుదలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తాయి. తద్వారా చర్మంపై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది.
Image credits: Instagram
Telugu
తగినంత నీరు
రోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగండి. యాంటీఆక్సిడెంట్లు (పండ్లు, కూరగాయలు) కలిగిన ఆహారం తీసుకోండి. ఇలా చేస్తే.. చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా ఉంటుంది.