Women's Day 2026: శారీరకంగా కాదు, మానసికంగా మహిళలు బలంగా మారాలంటే ఏం చేయాలి?
Women's Day 2026:మార్చి8వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా.. మహిళలు తమను తాము మానసికంగా బలంగా ఎలా మార్చుకోవాలో తెలుసా?

Women's Day
మహిళలు వీక్ అనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ.. ఒక మహిళ బలం కేవలం శారీరకంగా కాదు, మానసికంగా ఉండాలి. మానసిక స్థైర్యం ఉంటే.. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొని నిలపడగలుగుతారు. మరి.. మహిళలు మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలంటే.. ఎలాంటి లక్షణాలు అలవరుచుకోవాలో ఇప్పుడు చూద్దాం...
1.భావోద్వేగాలకు బానిసలు కాకూడదు...
మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండాలంటే మహిళలు తమ భావాలను అదుపులో ఉంచుకోవాలి. అంటే.. కోపం, బాధ లేదా నిరాశ కలిగినప్పుడు వెంటనే స్పందించకుండా, ఒక్క క్షణం ఆగాలి. ఎక్కడ శాంతంగా ఉండాలో, ఎక్కడ గట్టిగా సమాధానం చెప్పాలో తెలుసుకోవాలి.
2.మార్పును ఆహ్వానించాలి...
చాలా మంది చాలా స్త్రీలు.. జీవితంలో వచ్చే మార్పును స్వీకరించరు. కానీ.. ఎలాంటి మార్పు వచ్చినా దానికి అంగీకరించేవారు మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉంటారు. అలాంటివారు మాత్రమే జీవితంలో ఎదురయ్యే కొత్త పరిస్థితులకు భయపడకుండా, వాటిని ఒక అవకాశంగా మలుచుకుంటారు. ప్రతి సవాలు వారిని మరో మెట్టు పైకి ఎక్కించేలా మార్చుకోగలుగుతారు.
3. మొహమాట పడకుండా 'నో' చెప్పాలి..
అందరినీ సంతోష పెట్టాలని ప్రయత్నించడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతామనే విషయం తెలుసుకోవాలి. తమ ఎదుగుదలకు లేదా ప్రశాంతతకు అడ్డు వచ్చే ఏ విషయాన్నైనా, ఎలాంటి అపరాధ భావం (Guilt) లేకుండా నిర్మొహమాటంగా తిరస్కరించడం నేర్చుకోవాలి..
4. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకూడదు..
మానసిక స్థైర్యం గల మహిళలకు కడుపుబ్బరం లేదా కుళ్లు ఉండదు. ఇతరులు విజయం సాధించినప్పుడు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తారు. పక్కవారి ఎదుగుదల తమకు స్ఫూర్తినిస్తుందే తప్ప, భయాన్ని కలిగించదు.
5. తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలి..
ఏదైనా పని విఫలమైనప్పుడు పరిస్థితులను లేదా ఇతరులను నిందించకూడదు. తమ తప్పులకు తామే బాధ్యత వహించాలి. ఓటమిని ఒక అంతిమ నిర్ణయంగా కాకుండా, గెలుపుకు అవసరమైన ఒక పాఠంగా భావించాలి.
ఈ లక్షణాలను అలవరుచుకుంటే.. మానసికంగా బలంగా మారడమే కాదు... జీవితంలో గొప్ప స్థాయికి కూడా వెళతారు.

