MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair Care: కేరళ అమ్మాయిల జుట్టు అంత పొడుగ్గా పెరగడానికి సీక్రెట్ ఇదే..!

Hair Care: కేరళ అమ్మాయిల జుట్టు అంత పొడుగ్గా పెరగడానికి సీక్రెట్ ఇదే..!

 Hair Care: జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అలాంటివారు కొన్ని రకాల నూనెలను రెగ్యులర్ గా వాడితే...జుట్టు రాలడం తగ్గడమే కాదు.. ఒత్తుగా కూడా మారుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 21 2026, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Hair Care
Image Credit : our own

Hair Care

మీరు ఎప్పుడైనా కేరళ వాళ్లను చూశారా? చిన్న, పెద్ద అనే తేడా లేదు.. వారి జుట్టు చాలా అందంగా ఉంటుంది. కేరళకు చెందిన హీరోయిన్లకు కూడా జుట్టు చాలా పొడవుగా అందంగా ఉంటుంది. మరి, వాళ్ల హెయిర్ సీక్రెట్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్లు.. వాడే నూనెలే అందమైన జుట్టు సీక్రెట్. మరి, మీకు కూడా అలాంటి జుట్టు కావాలంటే.. ఎలాంటి ఆయిల్స్ వాడాలో ఇప్పుడు చూద్దాం...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
1.కొబ్బరి నూనె..
Image Credit : Getty

1.కొబ్బరి నూనె..

కేరళలో స్వచ్ఛమైన కొబ్బరి నూనె లభిస్తుంది. దానికి తోడు కొన్ని సహజంగా లభించే పదార్థాలు కలిపి ఆ నూనెను మనం జుట్టుకు వాడితే... ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. దాని కోసం మనకు కావాల్సినవి... కరివేపాకు, కొబ్బరి నూనె, మెంతులు, చిన్న ఉల్లిపాయ, నల్ల జీలకర్ర

నూనె తయారీ విధానం...

తాజా కరివేపాకులను తీసుకొని మిక్సర్‌లో పొడిగా చేసుకోవాలి. తరువాత మెంతులు , నల్ల జీలకర్రను విడిగా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో కరివేపాకు పొడి పోసి చిన్న ఉల్లిపాయ, మెంతి పొడి, నల్ల జీలకర్ర, స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసి స్టవ్ మీద మరిగించాలి. కనీసం 30 నిమిషాలు మరిగించి, ఆపై వడకట్టండి. మీరు ఈ నూనెను ప్రతిరోజూ మీ తలపై రాసుకుంటే మీకు ఉత్తమ ఫలితాలు వస్తాయి.

Related Articles

Related image1
Hair Care: ఖరీదైన షాంపూలతో పనిలేదు.. ఇవి రాస్తే.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!
Related image2
Weight Loss: మంతెన చెప్పిన ఈ మూడు ఫాలో అయితే.. వారానికి మూడు కేజీలు తగ్గడం ఖాయం
33
కొబ్బరి పాలు
Image Credit : Asianet News

కొబ్బరి పాలు

కేరళ మహిళలు జుట్టు పెరుగుదలకు , జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కొబ్బరి పాలను ఉపయోగిస్తారు. మీరు కూడా దీన్ని ప్రయత్నించొచ్చు. తల స్నానం చేసిన తర్వాత, కొబ్బరి పాలను వడకట్టాలి.తర్వాత ఆ కొబ్బరి పాలలో కలబంద జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని.. జుట్టు అంతటా పూసి, ఆపై గోరువెచ్చని నీటితో జుట్టును కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. మంచి హెయిర్ మాస్క్ లా పని చేస్తుంది.

కొబ్బరిపాలు, ఆలివ్ ఆయిల్..

కొబ్బరి పాలను కొద్దిగా వేడి చేసి, దానికి ఆలివ్ నూనె కలుపుతారు. దీనిని జుట్టుకు అప్లై చేసి, స్నానం చేసే ముందు 30 నిమిషాలు నానబెట్టాలి. జుట్టు పెరుగుదల కోసం, వారు కొబ్బరి పాలను తేనెతో కలిపి జుట్టుకు హెయిర్ ప్యాక్‌గా అప్లై చేచాలి. తర్వాత హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది.

వెల్వెట్ ఆయిల్

కేరళ మహిళలు మందపాటి, పొడవైన, నల్లటి జుట్టు కోసం వెల్వెట్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు.

కావలసినవి: కొబ్బరి నూనె-2 కప్పులు, మందార పువ్వులు-10, కరివేపాకు-1 కట్ట, నల్ల జీలకర్ర-2 స్పూన్లు, శంఖం గింజలు-10, మెంతులు-2 స్పూన్లు,

ఈ పదార్థాలన్నింటినీ ఒక పెద్ద గిన్నెలో వేసి 10 రోజులు నానబెట్టండి. బాగా నానబెట్టిన తర్వాత, దానిలోని నూనెను మాత్రమే వేరు చేయండి. తరువాత ఈ నూనెను ఒక గాజు సీసాలో వేసి నిల్వ చేయండి. రాత్రి మీ తలపై నూనెను అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. తరువాత ఉదయం, తలస్నానం చేసే ముందు, ఈ నూనెను మళ్ళీ మీ జుట్టుకు తేలికగా అప్లై చేసి, స్నానం చేయండి. మీరు ఈ పద్ధతిని వారానికి 2 సార్లు సరిగ్గా పాటిస్తే, మీరు అందమైన పొడవాటి జుట్టును పొందవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mango Storage: మామిడి పండ్లు రెండు వారాలైనా పాడవకుండా ఉండాలంటే సింపుల్ చిట్కాలు
Recommended image2
Kundan Mangalsutra: కుందన్ మంగళసూత్రాలు.. నేటితరం అమ్మాయిల కోసం
Recommended image3
Sarees: బంధాని నుంచి పటోలా వరకు అద్భుతమైన చీరలు ఇవిగో
Related Stories
Recommended image1
Hair Care: ఖరీదైన షాంపూలతో పనిలేదు.. ఇవి రాస్తే.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!
Recommended image2
Weight Loss: మంతెన చెప్పిన ఈ మూడు ఫాలో అయితే.. వారానికి మూడు కేజీలు తగ్గడం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved