Face Glow: చలికాలంలో ముఖం పొడిబారిందా? ఈ ఒక్క ఫేస్ ప్యాక్ వాడితే చాలు..!
Face Glow: చలికాలంలో చర్మం పొడిగా మారుతుంది. ఇది శరీరంలో నిర్జలీకరణానికి దారితీస్తుంది. దీని వల్ల పెదాలు పగిలిపోవడం, ముఖంపై బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Skin Care
వాతావరణం పూర్తిగా మారిపోయింది. చలి రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ చలికి స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చర్మం పొడిబారడం, పగలడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఫేస్ కి మాయిశ్చరైజర్ రాసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాంటి సమయంలో కేవలం ఒకే ఒక్క ఫేస్ ప్యాక్ వాడితే చాలు. అదే మెంతుల ఫేస్ ప్యాక్. మరి, దీనిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం....
మెంతుల ఫేస్ ప్యాక్....
ముందుగా ఒక కప్పు మెంతుల పొడి, ఒక కప్పు కలబంద జెల్, ఒక కప్పు బాదం నూనె తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో బాదం నూనె, కలబంద జెల్ వేసి బాగా కలపాలి. దానికి వేయించి మెత్తగా పొడి చేసుకున్న మెంతుల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని... మీ ముఖం, మెడకు బాగా అప్లై చేయాలి. 20 నిమిషాలు అలానే వదిలేసి.. తర్వాత కాటన్ వస్త్రంతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ముఖం మెరుస్తూ కనపడుతుంది. చర్మం పొడిబారే సమస్య కూడా తగ్గుతుంది.
మెంతుల ఫేస్ ప్యాక్ తో ప్రయోజనాలు....
మెంతుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు, వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తాయి. మెంతుల్లోని పోషకాలు ముఖాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి. చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది.
గమనిక...
మెంతుల్లో వివిధ రకాల పోషకాలు ఉన్నప్పటికీ, దానిని చర్మానికి అప్లై చేసేటప్పుడు, ప్యాచ్ టెస్టు చేసుకోవాలి. ఎలాంటి అలెర్జీలు రాలేదు అనుకున్నప్పుడు మాత్రమే... ముఖానికి రాయాలి. మీ ముఖంపై ఏదైనా అలెర్జీ వంటి సమస్యలు ఏమైనా ఉంటే... చర్మ నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.

