Face Glow: చలికాలంలో ముఖానికి నెయ్యి రాసుకుంటే ఏమౌతుంది?
Face Glow: వయసుతో సంబంధం లేకుండా యవ్వనంగా కనిపించాలని అనుకుంటున్నారా? దాని కోసం ఖరీదైన క్రీముల అవసరం లేదు. కేవలం రాత్రి పడుకునే ముందు నెయ్యితో ముఖానికి మసాజ్ చేస్తే చాలు.

Face Glow
మన ఇంట్లో ప్రతిరోజూ వాడుకునే నెయ్యి కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు.. అది ఆరోగ్యాన్ని పెంపొందించే సహజ ఔషధం కూడా. ముఖ్యంగా చర్మ సౌందర్యం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఒక స్పూన్ నెయ్యి తీసుకోవడం, లేదా చర్మానికి అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఈ చలికాలంలో ప్రతి రోజూ ముఖానికి నెయ్యి రాస్తే ఏమౌతుంది? కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం....
వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది, యవ్వనంగా మారుస్తుంది...
వయసు పెరుగుతుంటే.. ముఖంపై ముడతలు,గీతలు రావడం చాలా సహజం. వాటిని కవర్ చేసుకోవడానికి మార్కెట్లో దొరికే యాంటీ ఏజింగ్ క్రీములను చాలా మంది రాస్తూ ఉంటారు. వాటిని కొనడానికి చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ.. వాటికి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా.. కేవలం నెయ్యి రాస్తే చాలు. నెయ్యిలో విటమిన్ ఏ, ఈ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీని వల్ల ముఖంపై ముడతలు తగ్గుతాయి. యవ్వనంగా కనపడతారు. మీ చర్మం కూడా చాలా మృదువుగా కనపడుతుంది.
సహజమైన మెరుపు...
నెయ్యి ని రెగ్యులర్ గా ముఖానికి రాసి.. మంచిగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మ కణాలను పోషిస్తుంది. ఇలా చేయడం వల్ల... మేకప్ అవసరం లేకుండానే... సహజంగా మెరుస్తూ కనపడుతుంది. దీని వల్ల యవ్వనంగా, అందంగా కనపడతారు.
చర్మ సమస్యలు తగ్గిపోతాయి...
చాలా మందికి ముఖంపై దురద, ర్యాష్ లాంటివి వస్తూ ఉంటాయి. వాతావరణంలోని కాలుష్యం కారణంగా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వడ దెబ్బ, దుమ్మూ, ధూళి కారణంగా అలెర్జీలు వస్తూ ఉంటాయి. ఈ అలెర్జీ కారణంగా చర్మం దెబ్బతింటుంది. అలా జరగకుండా ఉండేందుకు ముఖానికి నెయ్యి రాస్తే సరిపోతుంది.
సహజంగా మాయిశ్చరైజర్...
రాత్రి పడుకునే ముందు ముఖానికి నెయ్యి రాయడం వల్ల అది మంచి మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. ఖరీదైన క్రీములు కూడా ఇవ్వలేనంత తేమను నెయ్యి ఇస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. యవ్వనంగా కూడా కనిపిస్తారు.
చర్మానికి నెయ్యి ఎలా అప్లై చేయాలి..?
రాత్రి పడుకునే ముందు కొద్దిగా నెయ్యి తీసుకొని మీ ముఖానికి అప్లై చేయాలి. తర్వాత... వృత్తాకారంలో చేతి వేళ్లతో కనీసం 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. రాత్రి ఇలా చేస్తే.. ఉదయానికి ఫేస్ గ్లో వచ్చేస్తుంది.
నెయ్యితో ఫేస్ ప్యాక్....
ఒక టీ స్పూన్ నెయ్యిలో కొద్దిగా పసుపు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కూడా మీ ముఖం యవ్వనంగా మెరుస్తూ కనపడుతుంది.

