Skin Care: చలికాలం మీ స్కిన్ అందంగా మారాలా..? ఇదొక్కటి రాస్తే చాలు..!
Skin Care: చర్మం పొడిబారకుండా ఉండటానికి, మొటిమలు రావడం తగ్గించడానికి, ప్రకాశవంతమైన రంగును పొందడానికి మీరు దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చు. దాల్చిన చెక్క ముఖాన్ని అందంగా మారుస్తుంది..

Skin Care
రోజు రోజుకీ చలి పెరిగిపోతోంది. ఈ చలిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా, ఈ సీజన్ లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా... స్కిన్ పాడైపోతూ ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా...ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ చలికాలంలో మొటిమల సమస్యతో బాధ పడుతున్నట్లయితే... ఖరీదైన క్రీములతో పనిలేదు.. కేవలం ఇంట్లో దొరికే కొన్ని ఉత్పత్తులు వాడితే సరిపోతుంది. మరి, ఈ చలికాలంలో చర్మాన్ని ఎలా ప్రకాశవంతంగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం....
చలికాలంలో చర్మ సంరక్షణ...
చర్మం పొడిబారకుండా ఉండటానికి, మొటిమలు రావడం తగ్గించడానికి, ప్రకాశవంతమైన రంగును పొందడానికి మీరు దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, అర టీ స్పూన్ మెంతుల పొడి, నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ముఖం, మెడ పై ఉన్న మెటిమలపై దీనిని అప్లై చేయాలి. దీనిలోని పోషకాలు ముఖాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
చలికాలంలో మీ చర్మం పొడిగా అనిపిస్తే...క్రీములు, మాయిశ్చరైజర్లను వాడుతూ ఉంటారు. అవి వాడినా కూడా చర్మం పొడిబారినట్లుగా అనిపిస్తుంది అంటే...ఒక 100ఎంఎల్ రోజ్ వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దీనిని రాయడం వల్ల చర్మం పొడిబారే సమస్య ఉండదు. ఎక్కువ తేమగా కూడా ఉంటుంది.
ముఖం మెరిసిపోవాలంటే....
చలికాలంలో మీ ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే.. ముల్తానీ మట్టి, రోజ్ వాటర్, గంధపు పేస్టు కలిపి మంచి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీనిని వారానికి రెండు లేదా మూడుసార్లు ఉపయోగించాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
చలి వాతావరణం వల్ల పొడి బారిన చర్మాన్ని నివారించాలి అనుకుంటే... మీరు పసుపు వాడొచ్చు. పసుపులో ఉండే కర్కుమిన్ లక్షణాలు ముఖం నుంచి మురికిని తొలగించి ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంచుతాయి. దీనితో పాటు.. పోషకాలు ఉన్న కూరగాయలు, పండ్లు, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రోజంతా చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

