Winter Skin Care: చలికాలంలో శరీరానికి ఆవనూనె రాస్తే ఏమౌతుంది?
Winter Skin Care: చలికాలంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా స్కిన్ ఎక్కువగా పాడౌతూ ఉంటుంది. ఎక్కువగా డ్రై అవుతుంది. అలాంటి సమస్యలకు ఆవ నూనెతో చెక్ పెట్టొచ్చు.

skin Care
చలికాలంలో చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే.. ఈ కాలంలో చర్మం చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అందరూ ఈ సమయంలో తమ స్కిన్ మృదువుగా మార్చుకోవడానికి మాయిశ్చరైజర్లు, బాడీ లోషన్స్ వాడుతూ ఉంటారు.కానీ, వాటికి బదులు ఆవ నూనె చర్మానికి వాడితే.. ముఖం మృదువుగా మారుతుందని మీకు తెలుసా?
చర్మానికి ఆవ నూనె వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు...
ఆవ నూనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. దీనిని ముఖం, చర్మానికి రాయడం వల్ల పొడిబారకుండా తేమగా ఉంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది.
సహజ మాయిశ్చరైజర్
శీతాకాలపు చల్లని గాలి చర్మపు తేమను తొలగిస్తుంది. ఆవ నూనె మందంగా ఉంటుంది. దీనిలో.. విటమిన్ E సమృద్ధిగా ఉంటుంది, ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, చర్మం పొడిబారే సమస్యను కూడా తగ్గిస్తుంది.
చర్మ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది
ఆవ నూనె యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. శీతాకాలంలో దురద, దద్దుర్లు, చిన్న చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది.. ముడతలు కూడా రావు..
ఆవ నూనెలో విటమిన్ E , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మంచి మొత్తంలో ఉంటాయి. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. వయసు రీత్యా వచ్చే ముడతలు, ఫైన్ లైన్లను నివారిస్తుంది. దీని వల్ల యవ్వనంగా కనిపిస్తారు.
ట్యానింగ్ , నల్లటి మచ్చలను తొలగించడం
మీ ముఖంపై నల్లటి వలయాలు లేదా టానింగ్ ఉంటే, ఆవ నూనెను కొద్దిగా శనగపిండి , నిమ్మరసంతో కలిపి రాయడం వల్ల మీ చర్మ రంగు ప్రకాశవంతంగా మారుతుంది. మీ ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. ప్రతిరోజూ ఈ నూనె రాయడం వల్ల మీ చర్మంలో వచ్చే మార్పును మీరు క్లియర్ గా చూస్తారు.

