Grey Hair: ఈ ఒక్క విటమిన్ లోపం ఉన్నా.. తెల్ల జుట్టు వచ్చేస్తుంది..!
Grey Hair: చిన్న వయసులోనే మీ జుట్టు తెల్లగా మారిపోతోందా? ఖరీదైన షాంపూలు, నూనెలు వాడినా ప్రయోజనం లేదని అనుకుంటున్నారా? అయితే..కేవలం ఒకే ఒక్క విటమిన్ తీసుకోవడం వల్ల దీనిని రివర్స్ చేయవచ్చు.

Grey Hair
ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ఈ తెల్ల వెంట్రుకలను కవర్ చేయడానికి హెన్నా అని, కలర్స్ అనీ ఏవేవో వాడేస్తూ ఉంటారు. అయితే... అసలు.. ఈ తెల్ల జుట్టు మీకు విటమిన్ లోపం వల్ల వస్తుందంటే నమ్ముతారా? అవును. కేవలం ఒకే ఒక్క విటమిన్ లోపం వల్ల చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. అదే విటమిన్ బి12.
విటమిన్ బి12 లోపం కారణంగా, జుట్టు త్వరగా నెరవడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా, అధిక ఒత్తిడి, నిద్రలేమి, తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తాయి. సరైన ఆహారం, పుష్కలంగా నీరు, సహజమైన జుట్టు సంరక్షణను పాటించడం ద్వారా, ఈ తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు. మీ జుట్టును ఎక్కువ కాలం నల్లగా నిగనిగలాడేలా చేసుకోవచ్చు.
తెల్ల జుట్టు రావడానికి కారణం ఏంటి?
జుట్టు రంగు మెలనిన్ అనే వర్ణద్రవ్యంపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో విటమిన్ బి12 లోపం ఉంటే, మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది, దీనివల్ల మీ జుట్టు నలుపు రంగు నుంచి నెమ్మదిగా తెల్లగా మారిపోతాయి.ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు, నాడీ వ్యవస్థకు విటమిన్ బి12 చాలా అవసరం. దీని లోపం జుట్టును బలహీనపరచడమే కాకుండా, అకాలంగా నెరవడానికి కూడా దారితీస్తుంది.
విటమిన్ బి12 లోపం తగ్గాలంటే ఏం చేయాలి..?
మీరు విటమిన్ బి12 లోపంతో బాధపడుతుంటే, వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ముఖ్యం. నివేదిక ఆధారంగా, మీ డాక్టర్ సూచించిన విధంగా సప్లిమెంట్లు లేదా మందులు తీసుకోండి.
విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాలు ఏమిటి?
గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం , చేపలు, పుట్టగొడుగులు వంటి సహజంగా బి12 అందించే ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి. ఈ ఆహారాలు బి12 లోపాన్ని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహించడానికి సహాయపడతాయి.
ఇవి కూడా ముఖ్యమే...
జుట్టు ఆరోగ్యానికి విటమిన్ బి12 మాత్రమే కాదు, సమతుల్య ఆహారం కూడా చాలా అవసరం. ప్రతిరోజూ ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినండి, పుష్కలంగా నీరు త్రాగండి. ఒత్తిడిని నివారించండి. మంచి నిద్ర , ఆరోగ్యకరమైన జీవనశైలి మీ జుట్టు బలంగా ఉండటానికి, దాని సహజ రంగును ఎక్కువ కాలం పాటు నిలుపుకోవడానికి సహాయపడతాయి.

