స్పెషల్ అకేషన్స్ లో మీరు ఈ మెస్సీ బన్ హెయిర్ స్టైల్ ట్రై చేయవచ్చు. జుట్టు వెనక్కి లాగి, అడ్డంగా ముడివేసి కర్ల్ చేయాలి. ముందు వైపు చిన్న సైడ్ ఫ్లిక్స్ వదిలితే సరిపోతుంది.
మీ జుట్టు పలచగా ఉన్నా కూడా లేయర్ బై లేయర్ వేవ్స్ క్రియేట్ చేస్తూ సింపుల్‌గా జడ వేసుకోండి. దీనిని ముత్యాలు, ఆర్టిఫిషియల్ పువ్వులతో అలంకరించడం మర్చిపోవద్దు. ఒత్తుగా కనిపిస్తుంది.
స్లీక్ హెయిర్‌కి సైడ్ జడ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నిక్కీ మెస్సీ హెయిర్‌తో పాటు, పల్చటి జడను లేస్‌తో అలంకరించింది. మీరు దీనిని గజ్రా లేదా బేబీ బ్రీత్ పువ్వులతో కూడా అలంకరించుకోవచ్చు
జుట్టును బౌన్సీగా చూపించడానికి మీరు ఈ హెయిర్‌డోను ట్రై చేయవచ్చు. ఇందులో ఒక వైపు లైట్‌గా పఫ్ క్రియేట్ చేసి, మరోవైపు ప్లెయిన్‌గా వదిలేస్తారు. చీర మీదకు చాలా బాగుంటుంది.
జుట్టు పల్చగా లేదా పొట్టిగా ఉంటే ఫ్లాట్ హెయిర్‌స్టైల్ బెస్ట్. ఇక్కడ మృణాల్ ఠాకూర్ జుట్టును మధ్యలో పాపిడి తీసి, హాఫ్ అప్ హాఫ్ డౌన్ లుక్ ఇచ్చింది. జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది.