సింపుల్ లుక్ ఇష్టపడే మహిళలు.. మెడకు కాకుండా చేతులకు బ్రేస్లేట్ లా నల్లపూసలు వేయడం మొదలుపెట్టారు. సింపుల్ గా ఉండటమే కాకుండా, ఏ డ్రెస్ కి అయినా సూట్ అవుతుంది.
2024 లో ఫ్యాషన్ పరంగా అదరగొట్టిన మోడల్ ఇది. మీరు మీ మంగళసూత్రానికి స్టైల్ జోడించాలనుకుంటే, ఈ చోకర్ స్టైల్ ట్రై చేయండి. ఇది వేసుకుంటే మెడలో వేరే ఏ నగలు వేసుకోనక్కర్లేదు.
మీరు కూడా సింపుల్ డిజైన్లు కాకుండా కాస్త భిన్నంగా ప్రయత్నించాలనుకుంటే, నల్లపూసలతో టెంపుల్ పెండెంట్ ఉన్న ఈ పొడవాటి మంగళసూత్రాన్ని ట్రై చేయండి. చీరల మీద బాగుంటుంది.
ప్రతి ఏడాదీ చైన్ మంగళసూత్రాలు మహిళల ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటాయి. ఇవి ప్లెయిన్ పెరల్ పెండెంట్‌తో వస్తాయి. చాలా క్లాసీ లుక్ ఇస్తాయి.
చక్కటి నగిషీ పనితో ఉండే పెండెంట్ ఉన్న మంగళసూత్రాలు దాదాపు ప్రతి మహిళ వార్డ్‌రోబ్‌లో కనిపిస్తాయి. బంగారం కొనే బడ్జెట్ లేకపోతే, మెటల్ వర్క్‌తో ఉన్నవి కొనుక్కోవచ్చు.
చిక్ ఫ్లవర్ డిజైన్‌తో ఉన్న ఈ బంగారు మంగళసూత్రం వర్కింగ్ విమెన్‌కు పర్ఫెక్ట్ ఛాయిస్. మీకు హెవీ లుక్ నచ్చకపోతే దీన్ని ఎంచుకోవచ్చు. ఆర్టిఫిషియల్ జ్యూవెలరీలో ఇలాంటివి 200కే దొరుకుతాయి.
మంగళసూత్రం అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ఈ నల్లపూసలకు బదులుగా, కేవలం గోల్డ్ చైన్‌తో ఉన్న డిజైన్లను ఎక్కువగా ఇష్టపడ్డారు. మీరు కూడా దీని నుంచి స్ఫూర్తి పొందవచ్చు.