Hair Care: షాంపూలో ఇదొక్కటి కలిపి రాస్తే, జుట్టు పొడుగ్గా పెరగాల్సిందే..!
వయసు పెరగడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. జుట్టు రాలడం తగ్గాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

Hair Care
ఒత్తైన, పొడవైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ఈ రోజుల్లో హెల్దీ ఆహారం తినకపోవడం, కాలుష్యం తదితర కారణాల వల్ల తలమీద జుట్టు ఉండటమే కష్టమైపోతుంది. అందుకే.. పొడవైన జుట్టు అనేది చాలా మంది అమ్మాయిల్లో కల గానే మిగిలిపోతోంది. మార్కెట్లో దొరికే రసాయాలు ఉండే షాంపూలు, నూనెలు వాడటం వల్ల జుట్టు మరింత బలహీనంగా మారిపోతుంది. కానీ.. మనం ఒక సింపుల్ హోం రెమిడీ ఫాలో అవ్వడం వల్ల ఒత్తైన, పొడవైన జుట్టును చాలా ఈజీగా పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Long Hair
వయసు పెరగడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. జుట్టు రాలడం తగ్గాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు ఒత్తిడి తగ్గించుకోవడం, రసాయనాలు ఉండే ఉత్పత్తులు జుట్టుకు వాడటం కూడా తగ్గించుకోవాలి.అప్పుడే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.దీనితో పాటు.. మీరు వాడే షాంపూలో కేవలం ఒకదానిని కలపడం వల్ల మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి.
బెస్ట్ హోం రెమిడీ..
అందుకే మేము మీకు ప్రత్యేకమైన హెయిర్ గ్రోత్ వాటర్ రెసిపీని తీసుకువచ్చాము.దీనిలో మీరు 1 చెంచా షాంపూ జోడించడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
నీరు - 2 గ్లాసులు
బెండకాయ - 3-4 తరిగిన
కలోంజి (నల్ల జీలకర్ర) - 1 టీస్పూన్
మెంతులు - 1 టీస్పూన్
అల్లం - 5-6 చిన్న ముక్కలు
ఎలా వాడాలంటే..
ముందుగా, ఒక పాత్ర తీసుకొని, దానిలో 2 గ్లాసుల నీరు పోసి, వేడి చేయండి.ఇప్పుడు పాన్‌లో 3-4 తరిగిన బెండకాయ, ఒక టీస్పూన్ నల్ల జీలకర్ర, ఒక టీస్పూన్ మెంతులు, 5-6 అల్లం ముక్కలు వేయండి. వీటిని బాగా మరిగించాలి. నీరు చిక్కగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు ఈ నీటిని ఒక గిన్నెలోకి వడకట్టి మీ జుట్టుకు అప్లై చేయండి. దీనిలోనే షాంపూ కూడా కలిపి హెయిర్ వాష్ చేస్తే చాలు. కనీసం 10 నిమిషాలు అలానే ఉంచి.. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.
ప్రయోజనాలు..
జుట్టుకు బెండకాయను ఉపయోగించడం వల్ల మంచి కండిషనర్ లా పని చేస్తుంది. దీనిలోని పోషకాలు జుట్టును బలోపేతం చేస్తాయి. జుట్టు చిట్లిపోకుండా కాపాడుతుంది. జుట్టు అందంగా మారుతుంది.
నల్ల జీలకర్రతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు..
నల్ల జీలకర్ర కూడా జుట్టును అందంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయం చేస్తాయి. దీనిని రెగ్యులర్ గా వాడటం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. నల్ల జీలకర్రలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి, ఇవి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడతాయి. మీరు కోరుకుంటే, మీరు మీ జుట్టుకు నల్ల జీలకర్ర నూనెను కూడా ఉపయోగించవచ్చు.