Telugu

అరటి తొక్కను ఇలా వాడితే మీ అందం పెరగడం పక్కా!

Telugu

మృదువుగా, తేమగా..

అరటి తొక్కలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో తేమను నిలిపి ఉంచుతుంది. పొడి చర్మాన్ని హైడ్రేట్‌గా, మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.

Image credits: Pinterest
Telugu

ముడతలు మాయం

అరటి తొక్కలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై సన్నని గీతలు, ముడతలను తొలగించడానికి సహాయపడతాయి.

Image credits: Pinterest
Telugu

మొటిమల సమస్య దూరం

అరటి తొక్కతో చర్మంపై రోజూ మసాజ్ చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. 

Image credits: Pinterest
Telugu

డార్క్ సర్కిల్స్ మాయం

కళ్ల కింద నల్లటి వలయాలు తొలగించడానికి అరటి తొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. అరటి తొక్క, కలబంద గుజ్జు కలిపి పేస్ట్‌లా చేసి కళ్ల చుట్టూ అప్లై చేస్తే సరిపోతుంది.

Image credits: Freepik
Telugu

జుట్టు ఆరోగ్యం

అరటి తొక్క తలపై చర్మంలో తేమను నిలిపి, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. 

Image credits: Freepik
Telugu

ఆక్సిడేటివ్ స్ట్రెస్

జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణమైన ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడానికి అరటి తొక్క సహాయపడుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.

Image credits: Pinterest

Curly Hair: సాక్సులతో సింపుల్ గా హెయిర్ కర్ల్స్ ఎలా చేయాలో తెలుసా?

Sharara Suits: చిన్నారుల కోసం అందమైన షరార సూట్స్.. ఇవిగో

Silver Toe Rings: పాదాల అందాన్ని పెంచే బటర్ ఫ్లై డిజైన్ మెట్టెలు

Dandruff: తలలో చండ్రు ఎక్కువగా ఉందా? వీటితో వదిలించండి