- Home
- Life
- Woman
- Grey Hair: మంతెన చెప్పిన చిట్కా.. ఈ ఆకుల పేస్టు రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే..!
Grey Hair: మంతెన చెప్పిన చిట్కా.. ఈ ఆకుల పేస్టు రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే..!
Grey Hair: చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చేశాయా? వెంటనే మార్కెట్లో దొరికే కలర్స్ తెచ్చేసి పూసేస్తూ ఉంటారు. కానీ మంతెన సత్య నారాయణ రాజు చెప్పిన ఈ చిట్కా వాడితే మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.

Grey Hair
Grey Hair: ఈ రోజుల్లో చిన్నా, పెద్దా అనే తేడా లేదు అందరికీ తెల్ల జుట్టు వచ్చేస్తోంది.తెల్ల జుట్టు కేవలం వయసు రీత్యా వచ్చే సమస్య మాత్రమే కాదు.. మానసిక ఒత్తిడి కారణంగా కూడా వస్తూ ఉంటుంది. అంతేకాదు.. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, కెమికల్స్ తో నిండి ఉన్న నూనెలు, షాంపూలు వాడటం వల్ల కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది.
కానీ, తెల్ల జుట్టు రావడాన్ని ఎవరూ తట్టుకోలేరు. వయసు పైబడిన వారిలా కనపడుతున్నాం అని కంగారుపడిపోతారు. అందుకే, వెంటనే వాటిని కవర్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. కానీ, వాటి కారణంగా జుట్టు మరింత పాడైపోతుంది. తెల్ల వెంట్రుకలు మరింత ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. అయితే.. మంతెన చెప్పిన ఒక సింపుల్ చిట్కా వాడితే.. మీకు తెల్ల జుట్టు సమస్య అనేది ఉండదు.
తెల్ల జుట్టుకు మంతెన చెప్పిన సీక్రెట్...
మనకు పుదీనా ఆకులు తాజాగా చాలా సులభంగా లభిస్తాయి. వీటితోనే తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చని మంతెన చెబుతున్నారు. ఇప్పటి వరకు పుదీనా ఆకులను మనం వంటకు మాత్రమే ఉపయోగించాం. వీటిని వేయడం వల్ల వంటకు కమ్మనైనా రుచి, వాసన ఇస్తుందని మనకు తెలుసు. ఇదే ఆకు ఇప్పుడు మన అందాన్నిపెంచుకోవడానికి ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం...
తాజా పుదీనా ఆకులను వాటి కొమ్మలతో సహా తీసుకోవాలి. పుదీనా కొమ్మలలో కూడా ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టును జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి. ముఖ్యంగా తెల్ల వెంట్రుకలు ఎక్కువగా ఉన్నచోట రాయాలి. ఈ ప్యాక్ ని కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. తర్వాత కుండుకాయలతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
ఈ పుదీనా మిశ్రమం జుట్టు రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
పుదీనా లో మెంతాల్ అనే కెమికల్ ఉంటుంది. దీని వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. దీని వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతేకాకుండా.. జుట్టు రాలడం తగ్గడానికి, నల్లగా నిగనిగలాడటానికి కావాల్సిన విటమిన్లను కూడా అందిస్తుంది. రెగ్యులర్ గా రాయడం వల్ల జుట్టు లోని సహజ రంగు మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది.
పుదీనాలోని యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు తలలో చుండ్రును తగ్గించి, జుట్టు రాలకుండా చూస్తాయి. వేసవి కాలంలో పుదీనా ప్యాక్ తలకు మంచి చల్లదనాన్ని ఇస్తుంది.

