MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Woman
  • Hair Care: కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే..జుట్టు వేగంగా పెరుగుతుంది..

Hair Care: కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే..జుట్టు వేగంగా పెరుగుతుంది..

 Hair Care: ఎండాకాలంలో వేడికి తలలో దురద, చమట రావడం సహజం. వీటి కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. తలలో చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది.ఈ సమస్యకు కొబ్బరి నూనెతో చెక్ పెట్టొచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 24 2026, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Summer Hair Care
Image Credit : Getty

Summer Hair Care

ఎండాకాలంలో విపరీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అసలే వేడి..దానికి తోడు చెమటలు ఎక్కువగా పడతాయని చాలా మంది ఈ సీజన్ లో తలకు నూనె రాయరు. దీని వల్ల మరింత జిడ్డుగా మారుతుందని భయపడతారు. కానీ, మనం కొబ్బరి నూనెలో మరి కొన్ని నూనెలు కలిపి రాస్తే.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
జుట్టు పెరగడానికి కొబ్బరి నూనె ఎలా సహాయపడుతుంది?
Image Credit : Pixabay

జుట్టు పెరగడానికి కొబ్బరి నూనె ఎలా సహాయపడుతుంది?

కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీనిలో సుమారు 80 నుంచి 90 శాతం వరకు ప్రధానంగా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, విటమిన్ ఇ, ఫినాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు వేగంగా పెరగడానికి హెల్ప్ అవుతాయి. ఈ నూనెకి మరికొన్ని నూనెలను కలపడం వల్ల జుట్టు అందంగా, ఆరోగ్యంగా మారుతుంది.

33
మీ జుట్టు తత్వాన్ని బట్టి కొబ్బరి నూనెలో ఏ నూనె కలిపి రాయాలి?
Image Credit : Getty

మీ జుట్టు తత్వాన్ని బట్టి కొబ్బరి నూనెలో ఏ నూనె కలిపి రాయాలి?

1. జుట్టు ఎదుగుదలకు: ఆర్గాన్ + ఆముదం నూనె

ఆర్గాన్ నూనెలో విటమిన్ ఇ, ఒలిక్ , లినోలిక్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఆముదంతో కలిపి వాడితే:

తలకు అవసరమైన తేమ అందుతుంది.చుండ్రు పేరుకుపోకుండా ఉంటుంది.జుట్టు సహజంగా, ఒత్తుగా పెరుగుతుంది.

2. పలుచని జుట్టుకు: ఆముదం + కొబ్బరి నూనె

ఆముదం నూనె చిక్కగా ఉంటుంది, కాబట్టి దీనిని కొబ్బరి నూనెతో కలిపి వాడటం మంచిది. ఈ నూనె రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్లకు తేమను అందించి జుట్టును బలంగా చేస్తుంది.చుండ్రు సమస్య కూడా ఉండదు.

3. జుట్టు మరీ బలహీనంగా ఉంటే: ఆవ నూనె

ఆవ నూనెలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు , జింక్, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. కొబ్బరి నూనెలో ఈ ఆవ నూనె కలిపి రాస్తే.. జుట్టు బలంగా మారుతుంది. తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. చుండ్రు సమస్య కూడా ఉండదు.

4. చుండ్రు , ఇన్ఫెక్షన్లకు: వేప నూనె

వేపలో ఉండే అజాడిరాక్టిన్, నింబిన్ వంటి సమ్మేళనాలు శక్తివంతమైన యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి.

తల చర్మంపై ఉండే బాక్టీరియా, ఫంగస్ ను నిర్మూలిస్తుంది. వారానికి రెండుసార్లు కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే చుండ్రు నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

5. దెబ్బతిన్న (Damaged) జుట్టుకు: ఆలివ్ నూనె

పొడిబారిన, గరుకైన జుట్టు ఉన్నవారికి ఆలివ్ నూనె ఒక వరప్రసాదం.ఇందులో ఉండే విటమిన్ ఇ జుట్టును మృదువుగా చేస్తుంది. కొబ్బరి నూనెతో కలిపి మసాజ్ చేయడం వల్ల దెబ్బతిన్న జుట్టు కుదుళ్లు మళ్ళీ జీవం పోసుకుంటాయి. జుట్టు అందంగా కూడా కనిపిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Hair Care Tip: రోజూ ఇదొక్కటి తింటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు
Recommended image2
Hair Care Tips For Summer: పెరుగులో ఇవి కలిపి రాస్తే.. జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టినట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved