Periods: పీరియడ్స్ లో భర్త పక్కన ఉంటే, నొప్పి తగ్గుతుందా?
మందులతో పని లేకుండా.. కేవలం మీ భర్త మీ పక్కన ఉంటే చాలు. వారి సపోర్ట్ ఉంటే, పీరియడ్ పెయిన్ తగ్గిపోతుందని ఓ సర్వేలో తేలింది.

పీరియడ్ పెయిన్..
పీరియడ్స్ స్త్రీలను ప్రతి నెలా పలకరిస్తూనే ఉంటాయి. ఇక పీరియడ్స్ సమయంలో నొప్పి ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పీరియడ్ పెయిన్ తగ్గించుకునేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ వాడతారు.. లేదా ఏదైనా హోం రెమిడీస్ వాడుతూ ఉంటారు. అయితే, ఇవేమీ లేకుండానే ఎలాంటి నొప్పి అయినా ఈజీగా తగ్గించేయవచ్చు. అదేంటో తెలుసా? మీ భర్త మీ పక్కన ఉండటం.
హార్మోన్లలో మార్పులు..
మీరు చదివింది నిజమే, మందులతో పని లేకుండా.. కేవలం మీ భర్త మీ పక్కన ఉంటే చాలు. వారి సపోర్ట్ ఉంటే, పీరియడ్ పెయిన్ తగ్గిపోతుందని ఓ సర్వేలో తేలింది. నిపుణులు చెప్పిన దాని ప్రకారం, పీరియడ్స్ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి.
భర్త పక్కన ఉంటే..
ముఖ్యంగా ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిల్లో హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. దీని వల్ల మహిళల్లో మూడ్ స్వింగ్స్, చిరాకు, అలసట, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో మహిళలు తమ భాగస్వామితో ఉన్నప్పుడు, అది వారికి భావోద్వేగ మద్దతును ఇస్తుంది. దీని కారణంగా మహిళలు సురక్షితంగా ఉన్న భావన పొందుతారు.
ప్రేమ హార్మోన్..
అంతేకాదు.. భర్త పక్కన ఉన్నప్పుడు.. ప్రేమ హార్మోన్ అని పిలిచే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలౌతుంది. ఆక్సిటోసిన్ నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. కొంతమంది మహిళలు తమ భాగస్వామి దగ్గర ఉండటం వల్ల తక్కువ నొప్పిని అనుభవించడానికి ఇదే కారణం. మానసికంగా సంతోషాన్ని కలిగిస్తుంది.
చిన్న కౌగిలింత..
పీరియడ్స్ సమయంలో కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా వీపు మీద తట్టడం వంటి ప్రేమపూర్వక స్పర్శ మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇది శారీరక, భావోద్వేగ స్థాయిలలో ఉపశమనం ఇస్తుంది.అయితే.. భర్త పక్కన ఉండి ప్రేమ చూపిస్తే, పీరియడ్ పెయిన్ పూర్తిగా తగ్గుతుందని అర్థం కాదు. కాకపోతే.. వారు చూపించే ప్రేమ కారణంగా కాస్త ఊరటగా అనిపిస్తుంది. నొప్పిని మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.