Hair Oil: ఈ గింజల నూనె రాసినా రాస్తే... హెయిర్ ఫాల్ ఉండదు..!
Hair Oil: గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ గింజలు తినడం వల్ల ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో, ఈ గింజల నూనె జుట్టుకు రాయడం వల్ల జుట్టు కూడా అంతే మెరుగుపడుతుంది.

Hair Oil
ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. ఈ జుట్టు రాలడానికి వెనక చాలా కారణాలు ఉండొచ్చు. కానీ నార్మల్ కొబ్బరి నూనె వాడితే జుట్టు రాలడం తగ్గకపోవచ్చు. అలాంటి సమయంలో కేవలం ఒక రకమైన గింజల నూనె వాడితే సరిపోతుంది. మరి, ఆ నూనె ఏంటి? దానితో జుట్టు రాలడం ఎలా తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం...
గుమ్మడి గింజల నూనె..
గుమ్మడి గింజలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజల్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా, గుమ్మడి గింజల నుంచి తయారైన నూనె, పెపిటాస్, జుట్టుకు సహాయపడే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా దీనిని ఉపయోగించడం చాలా సులభం.
గుమ్మడి గింజల నూనెతో జుట్టుకు ప్రయోజనాలు...
గుమ్మడికాయ గింజల నూనె మీడియం-డెన్సిటీ ఆయిల్. జుట్టు ఎండిపోకుండా.. తేమగా ఉండటానికి సహాయం చేస్తుంది. ఈ నూనె పొడి జుట్టు ఉన్నవారికి వరంలా పని చేస్తుంది అని చెప్పొచ్చు. అంతేకాదు.. జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే బయోటిన్, విటమిన్ బి జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. చుండ్రు సమస్య ఉండదు. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
గుమ్మడికాయ గింజల నూనెను ఎలా ఉపయోగించాలి:
గుమ్మడికాయ గింజల నూనెను నేరుగా తీసుకొని మీ జుట్టు భాగాలపై సమానంగా వ్యాప్తి చేయండి. తలకు బాగా మసాజ్ చేయాలి. తర్వాత.. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. రాత్రిపూట ఈ నూనె జుట్టుకు అప్లై చేసి.. మరుసటి రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల... మీ జుట్టు అందంగా మారుతుంది. నూనె కనీసం 12 నుంచి 24 గంటలకు జుట్టుకు అప్లై చేసి అలానే వదిలేయడం వల్ల.. నూనెలోని పోషకాలన్నీ జుట్టుకు అందుతాయి.
నూనె జుట్టుకు రాసిన 12 గంటల తర్వాత, మీరు తేలికపాటి షాంపూ ఉపయోగించి గోరువెచ్చని నీటిలో స్నానం చేయవచ్చు. మీరు వారానికి ఒకసారి ఈ ప్రక్రియను కొనసాగిస్తే, మీరు మంచి ఫలితాలను పొందవచ్చు.

