- Home
- Life
- Woman
- Hair Conditioner: జుట్టు స్మూత్ గా మెరిసిపోవాలా? ఈ హోం మేడ్ కండిషనర్ అప్లై చేస్తే చాలు..!
Hair Conditioner: జుట్టు స్మూత్ గా మెరిసిపోవాలా? ఈ హోం మేడ్ కండిషనర్ అప్లై చేస్తే చాలు..!
Hair Conditioner: మీ జుట్టు బాగా డ్రైగా మారి ఎండు గడ్డిలా అనిపిస్తోందా? మ్యాజిక్ లా డ్రై హెయిర్.. మళ్లీ స్మూత్ గా పట్టుకుచ్చులా మారిపోతే బాగుండు అని అనుకుంటున్నారా? దానికి ఏం చేయాలో తెలుసా?

Hair Care
ప్రస్తుత కాలంలో.. కాలుష్యం, ఎండ ఎక్కువగా ఉండటం. అన్నీ కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు వాడటం వల్ల జుట్టు నిర్జీవంగా, చిక్కులుగా మారిపోతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో జుట్టు జిడ్డుగా, పొడిగా మారిపోతూ ఉంటుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన కండిషనర్లలో రసాయనాలు ఉండటం వల్ల మన జుట్టుకు మేలు కంటే.. కీడే ఎక్కువగా జరుగుతుంది.
ఈ సమస్య నుంచి బయటపడాలంటే... మనం ఇంట్లోనే సహజ సిద్ధమైన పదార్థాలతో జుట్టును పట్టులా మెరిపించే నేచురల్ హెయిర్ కండిషనర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీకి కావాల్సినవి...
కలబంద జెల్: ఇది జుట్టుకు మంచి తేమను అందిస్తుంది.
బాగా పండిన అరటిపండు: జుట్టును మృదువుగా మార్చుతుంది.
తేనె: సహజ సిద్ధమైన మెరుపును ఇస్తుంది.
కొబ్బరి పాలు: జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.
తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మీ జుట్టు పొడవుకు సరిపడా అలోవెరా జెల్ వేయండి.
అరటిపండును మెత్తగా పేస్ట్ లా చేసి అందులో కలపండి (ఉండలు లేకుండా చూసుకోండి).
దీనికి ఒక స్పూన్ తేనె , 2-3 టేబుల్ స్పూన్ల తాజా కొబ్బరి పాలు కలపండి.
వీటన్నింటినీ బ్లెండర్‌లో వేసి మిక్సీ పడితే సాఫ్ట్ క్రీమ్ లాంటి పేస్ట్ తయారవుతుంది.
ఎలా ఉపయోగించాలి?
జుట్టును షాంపూతో శుభ్రం చేసుకున్న తర్వాత, ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుండి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించండి.
10 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై సాధారణ నీటితో కడిగేయండి.
వారానికి 1-2 సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోవడం (Split ends) తగ్గుతుంది.
బయటకు వెళ్లడానికి 3-4 గంటల ముందే ఈ కండిషనర్ వాడటం వల్ల ఎండ ప్రభావం జుట్టుపై తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. జుట్టు స్మూత్ గా, అందంగా కూడా మారుతుంది.

