MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Saree Tips: చీరలో లావుగా కనిపిస్తున్నారా? ఇదొక్క ట్రిక్ తో సన్నగా కనిపిస్తారు, పొట్ట కూడా కనిపించదు

Saree Tips: చీరలో లావుగా కనిపిస్తున్నారా? ఇదొక్క ట్రిక్ తో సన్నగా కనిపిస్తారు, పొట్ట కూడా కనిపించదు

Saree Tips:  చాలా మంది సెలబ్రెటీలు చీరలో చాలా సన్నగా, ఎత్తుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్లు అలా కనిపించడానికి కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అవుతారని మీకు తెలుసా?  అవి ఫాలో అయితే మీరు కూడా  సన్నగా కనిపించొచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : May 18 2026, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చీరలో సన్నగా కనిపించాలంటే...
Image Credit : stockPhoto

చీరలో సన్నగా కనిపించాలంటే...

చీర మన దేశ సంప్రదాయ వస్త్రం. పండగలు, పూజలు, పెళ్లిళ్లు.. ఏ ఫంక్షన్ ఉన్నా సరే.. మహిళల మొదటి ఛాయిస్ చీర. కానీ.. చాలా మందికి  చీర ఎలా కట్టుకోవాలో సరిగా తెలీదు. ఎందుకంటే.. సరిగా కట్టుకోవడం రాక.. చీర కట్టుకుంటే తాము లావుగా కనిపిస్తున్నాం అని ఫీలౌతూ ఉంటారు.  కానీ, ఎలా కట్టుకోవాలో తెలిస్తే.. చీర కంటే అందంగా మనల్ని చూపించేది మరొకటి ఉండదు. మరి.. చీరలో సన్నగా కనిపించాలంటే ఏం చేయాలి? ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సరైన పెట్టికోట్ ఎంచుకోవడం...
Image Credit : stockPhoto

సరైన పెట్టికోట్ ఎంచుకోవడం...

చీరలో అందంగా కనిపించాలంటే సరైన పెట్టికోట్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా అమ్మ, అమ్మమ్మలు వేసుకొనే కాటన్ పెట్టికోట్ వేసుకుంటే చీరకు సరిగా సెట్ అవ్వదు.  అందుకే మార్కెట్లో ఇప్పుడు ఈజీగా అందుబాటులో ఉన్న షేప్ వేర్ కొనుక్కోవాలి. ఇవి మీ శరీరానికి పర్ఫెక్ట్ షేప్ ఇస్తాయి. దీని వల్ల మీ  పొట్ట, నడుము కూడా సన్నగా కనిపిస్తాయి.

35
చీర మెటీరియల్
Image Credit : stockPhoto

చీర మెటీరియల్

స్లిమ్‌గా కనిపించాలంటే చీర మెటీరియల్ చాలా ముఖ్యం. షిఫాన్ లేదా జార్జెట్ చీరలు మిమ్మల్ని నాజూగ్గా చూపిస్తాయి. బరువైన చీరలకు బదులుగా వీటిని ఎంచుకోండి. ఈ చీరలు సహజంగా శరీరంపై పడిపోతాయి కాబట్టి స్లిమ్ లుక్ వస్తుంది. ఇక.. చీరకు పెద్ద అంచు ఉన్నవి వేసుకుంటే మీరు పొట్టిగా కనిపిస్తారు. అదే చిన్న అంచు ఉన్న చీర ఎంచుకుంటే.. పొడవుగా కనిపించే అవకాశం ఉంది.

45
బ్లౌజ్
Image Credit : stockPhoto

బ్లౌజ్

చీరతో పాటు వేసుకునే బ్లౌజ్‌లు కూడా మిమ్మల్ని స్లిమ్‌గా కనిపించేలా చేస్తాయి. కొంచెం డీప్ నెక్ లేదా పొడవాటి బ్లౌజ్‌లు మిమ్మల్ని అందంగా చూపిస్తాయి. బ్లౌజ్ డిజైన్ ఎంత సింపుల్‌గా ఉంటే అంత ఆకర్షణీయంగా ఉంటారు. మీ శరీరం గుండ్రంగా ఉంటే, నడుమును కవర్ చేసేలా పొడవాటి షర్ట్ లేదా టాప్ లాంటి బ్లౌజ్ ధరించండి.
55
చీర కుచ్చిళ్లు
Image Credit : stockPhoto

చీర కుచ్చిళ్లు

చీర కుచ్చిళ్లను ఫ్లాట్‌గా పెట్టాలి. అలాగే పల్లు సెట్ చేసుకునేటప్పుడు కూడా కుచ్చిళ్లను సరిగ్గా సర్దుకోవాలి. ఇలా నిటారుగా, తక్కువ కుచ్చిళ్లు పెడితే మీ ఎత్తు ఎక్కువగా కనిపిస్తుంది. పొట్టిగా ఉండే మహిళలు ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకోవాలి.

మీరు మొదటిసారి చీర కడుతున్నట్లయితే, పిన్నులను సరిగ్గా పెట్టుకోండి. మీ పొట్టలోని కొవ్వు కనిపించకుండా చీరను బ్లౌజ్‌తో కలిపి పిన్ చేయాలి. ఇలా చేయడం వల్ల చీర లుక్ మరింత పెరుగుతుంది. చీర కట్టుకున్న తర్వాత పొడవాటి చెవిపోగులు, సింపుల్ గాజు, ఒక సన్నని గొలుసు, ఒకే ఒక్క ఉంగరం కూడా మిమ్మల్ని చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Saree Hack:చీర పర్ఫెక్ట్ గా కట్టుకోవాలా? ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే చాలు
Recommended image2
Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved