ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలంటే మీ మాయిశ్చరైజర్ ను ఇలా ఎంచుకోండి
woman-life May 16 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
ముందు మీ స్కిన్ ఏ టైప్ తెలుసుకోండి
మీది ఆయిలీ స్కిన్ అయితే 'ఆయిల్-ఫ్రీ' జెల్ మాయిశ్చరైజర్లు వాడాలి. అదే డ్రై స్కిన్ఉ న్నవాళ్లు తేమను అందించే 'రిచ్ క్రీమ్స్' ఎంచుకోవడం ఉత్తమం.
Image credits: pinterest
Telugu
పదార్థాలు చూసి కొనండి
హయలురానిక్ యాసిడ్, సెరమైడ్స్, గ్లిజరిన్ వంటి పదార్థాలు ఉన్న ప్రొడక్ట్స్ చర్మంలో తేమను లాక్ చేసి, ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచడానికి సాయపడతాయి.
Image credits: Getty
Telugu
పగలు, రాత్రి వేర్వేరుగా వాడాలి
పగటిపూట సూర్యరశ్మి నుంచి రక్షణ ఇచ్చే లైట్ మాయిశ్చరైజర్లు వాడాలి. రాత్రిపూట చర్మాన్ని రిపేర్ చేసే నైట్ క్రీమ్‌లను ఉపయోగించడం మంచిది.
Image credits: gemini ai
Telugu
సెన్సిటివ్ స్కిన్ అయితే మరింత జాగ్రత్త
మీది సెన్సిటివ్ స్కిన్ లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉంటే, ఫ్రాగ్రెన్స్-ఫ్రీ హైపోఅలెర్జెనిక్ ప్రొడక్ట్స్ మాత్రమే ఎంచుకోవాలి. లేకపోతే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.
Image credits: unsplash
Telugu
ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి
కొత్తగా ప్రొడక్ట్ కొన్నప్పుడు నేరుగా ముఖంపై రాయొద్దు. ముందుగా చెవి లేదా చేతిపై కొద్దిగా రాసి, ఎలాంటి అలర్జీ లేదని నిర్ధారించుకున్నాకే యూజ్ చేయాలి. లేదంటే ముఖంపై దద్దుర్లు వస్తాయి.
Image credits: Getty
Telugu
కాస్త తడిగా ఉన్నప్పుడే రాయాలి
ముఖం కడుక్కున్న తర్వాత చర్మం పూర్తిగా ఆరకముందే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేస్తే అది చర్మంలోకి బాగా ఇంకుతుంది.
Image credits: Asianet News
Telugu
కాలాన్ని బట్టి మాయిశ్చరైజర్ మార్చాలి
వాతావరణం, సీజన్లు మారినప్పుడు మీ మాయిశ్చరైజర్‌ను కూడా మార్చాలి. వేసవిలో తేలికగా ఉండేవి, చలికాలంలో ఎక్కువ పోషణ ఇచ్చే క్రీమ్స్ వాడటం ఉత్తమం.