MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Woman
  • Hair Fall: ఈ మూడు గింజలు 20 రోజులు తింటే... మీ జుట్టు రాలడం ఆగడం పక్కా..!

Hair Fall: ఈ మూడు గింజలు 20 రోజులు తింటే... మీ జుట్టు రాలడం ఆగడం పక్కా..!

Hair Fall: ఎన్ని రకాల నూనెలు, షాంపూలు మార్చినా కూడా జుట్టు రాలడం ఆగడం లేదని ఫీలౌతున్నారా? మీ డైట్ లో కేవలం మూడు గింజలను చేర్చుకొని.. వాటిని రోజూ తింటే.. మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ లోకి వస్తుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 09 2026, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Hair Care
Image Credit : gemini a

Hair Care

ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. వాతావరణంలో కాలుష్యం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం కారణంగా.. జుట్టు రాలడం అనేది కామన్ సమస్యగా మారిపోయింది. ఈ సమస్య మొదలవ్వగానే...జుట్టురాలిపోతుందే అని చాలా మంది కంగారు పడిపోతారు. వెంటనే షాంపూలు, నూనెలు, కండిషనర్లు మార్చేస్తూ ఉంటారు. కానీ.. అవేమీ చేయకపోయినా.. మూడు రకాల గింజలు వరసగా 20 రోజులు క్రమం తప్పకుండా తింటే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇవి తింటే చాలు...
Image Credit : Getty

ఇవి తింటే చాలు...

గుమ్మడి గింజలు... ఈ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ లోపం వల్లే చాలా మందికి జుట్టు రాలుతుంది. అందుకే.. ఈ గింజలు తింటే.. ఆ సమస్య నుంచి బయటపడతారు. వీటిలో ఉండే అమినో యాసిడ్స్ జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి.

అవిసె గింజలు... జుట్టు చిట్లిపోవడం, తల చర్మం పొడిబారడం వంటి సమస్యలకు వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మంచి మందులా పని చేస్తాయి. ఇవి జుట్టుకు సహజమైన కండిషనర్ లా పని చేసి జుట్టుకు మంచి నిగారింపు ఇస్తాయి.

పొద్దు తిరుగుడు గింజలు... ఈ గింజల్లో ఉండే విటమిన్ ఇ, సెలీనియం ఉంటాయి. ఇవి తలలో రక్త ప్రసరణను వేగవంతం చేసి, జుట్టు మళ్లీ వేగంగా పెరగడానికి సహాయపడతాయి.

Related Articles

Related image1
Grey hair: తెల్ల జుట్టు వచ్చిందని ఫీలౌతున్నారా? మీ సమస్యకు ఇదే పరిష్కారం
Related image2
Hair Care: మంతెన ప్రకారం.. మెంతులు ఇలా వాడితే జుట్టు రాలడం ఆగుతుంది..!
33
ఈ గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు...
Image Credit : Getty

ఈ గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు...

మెరిసే చర్మం: యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ముఖంపై ముడతలు తగ్గి కాంతివంతంగా మారుతుంది.

హార్మోన్ల సమతుల్యత: థైరాయిడ్ లేదా హార్మోన్ల సమస్యల వల్ల జుట్టు రాలే వారికి ఇది దివ్యౌషధం.

గుండె ఆరోగ్యం: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి.

ఎలా తినాలి..?

గుమ్మడి గింజలు (50గ్రా), అవిసె గింజలు (50గ్రా), పొద్దుతిరుగుడు గింజలను (50గ్రా) సమానంగా తీసుకోండి.

వీటిని నూనె లేకుండా విడివిడిగా 2-3 నిమిషాలు దోరగా వేయించి చల్లార్చండి.మీరు వీటిని నేరుగా స్నాక్ లాగా తినవచ్చు లేదా మిక్సీ పట్టి పొడిలా చేసి రోజుకు రెండు స్పూన్లు మజ్జిగలోనో లేదా పెరుగులోనో కలుపుకుని తీసుకోవచ్చు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత తీసుకోవడం అత్యుత్తమం.

గమనిక..

ఏదైనా ఫలితం రావాలంటే ఓపిక ముఖ్యం. 20 రోజుల్లో జుట్టు రాలడం అదుపులోకి వస్తుంది, కానీ దృఢమైన, ఒత్తైన జుట్టు కోసం కనీసం 3 నెలల పాటు ఈ అలవాటును కొనసాగించండి. మంచిగా కోరుకున్న ఫలితం లభిస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Related Stories
Recommended image1
Grey hair: తెల్ల జుట్టు వచ్చిందని ఫీలౌతున్నారా? మీ సమస్యకు ఇదే పరిష్కారం
Recommended image2
Hair Care: మంతెన ప్రకారం.. మెంతులు ఇలా వాడితే జుట్టు రాలడం ఆగుతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved