Face Glow: ఉదయం లేవగానే ఇలా చేస్తే... మీ ముఖం యవ్వనంగా మారడం పక్కా..!
ఉదయం లేవగానే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోజంతా ముఖం తాజాగా ఉంటుంది.

Beauty Tips
వయసుతో సంబంధం లేకుండా, యవ్వనంగా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది.దాని కోసం ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ముఖానికి ఫేస్ క్రీములు, సీరమ్స్ లాంటివి పూసేస్తూ ఉంటారు. కానీ, వాటితో ఉపయోగం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇవేమీ అవసరం లేకుండానే.. అందంగా మెరిసిపోవచ్చు. దాని కోసం.. ఉదయం లేవగానే కొన్ని పనులు చేస్తే చాలు. మరి, అవేంటో చూద్దామా...
ఉదయం లేవగానే చేయాల్సిన మొదటి పని..
ఉదయం లేవగానే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోజంతా ముఖం తాజాగా ఉంటుంది. చాలా మంది ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బు, ఫేస్ వాష్ లాంటివి వాడుతూ ఉంటారు.కానీ అలా చేయకూడదు. చల్లటి నీటితో మాత్రమే ఫేస్ ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల మీ ముఖం రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల ముఖం రంధ్రాలలో పేరుకుపోయిన టాక్సిన్స్ విడుదలౌతాయి. మన చర్మంపై ఉపయోగించే రసాయన సౌందర్య సాధనాలు చర్మం లోపల పేరుకుపోయి చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తాయి. అందుకే.. అవేమీ లేకుండా కేవలం కూల్ వాటర్ తో మాత్రమే శుభ్రం చేసుకోవాలి.
హెల్దీ డ్రింక్...
మనం ఉదయాన్నే హెల్దీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా అందం మెరుగుపడుతుంది. దాని కోసం.. జీలకర్ర, నిమ్మకాయ, తేనె కలిపిన నీటిని తీసుకోవచ్చు. లేదంటే.. కూరగాయల జ్యూస్, కొబ్బరి నీరు లాంటివి కూడా తీసుకోవచ్చు. ఈ పానీయాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. స్కిన్ ని మెరిచేలా చేయడంలో హెల్ప్ చేస్తాయి.
మంచి నీరు తాగడం..
ఉదయం లేచిన వెంటనే మర్చిపోకుండా మంచినీరుు తాగాలి. ఇలా తాగడం వల్ల చర్మం తేమగా మారుతుంది. అంతేకాదు.. చర్మం మృదువుగా, మెరుస్తూ కనిపించేలా చేస్తుంది. చాలా మంది మహిళలు పనిలో బిజీగా ఉండటం వల్ల నీరు తాగడం మర్చిపోతారు.దీని వల్ల స్కిన్ పూర్తిగా డ్రైగా మారిపోతుంది. అందుకే.. పొరపాటున కూడా మంచినీరు తాగడాన్ని మర్చిపోవద్దు.
ఉదయం మీ ముఖానికి క్రీమ్ రాయకండి..
ఉదయం చల్లటి నీటితో మీ ముఖాన్ని కడిగిన తర్వాత మాయిశ్చరైజర్, క్రీమ్ లేదా మేకప్ వేయకండి.కనీసం గంటపాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాతే మీరు క్రీమ్ లాంటివి ఏమైనా రాసుకోవచ్చు. ప్రతిరోజూ ఇలా క్రమం తప్పకుండా ప్రయత్నించడం వల్ల.. మీ ముఖం అందంగా మెరుస్తూ కనపడుతుంది. మొటిమలు, మచ్చలు లాంటివి రాకుండా ఉంటాయి.