Face Glow: చలికాలంలో రాత్రిపూట ఇదొక్కటి రాసినా...ముఖం మెరిసిపోతుంది..!
Face Glow: చలికాలంలో చర్మం ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. ఫేస్ లో కళ కూడా తగ్గుతుంది. అయితే..కొన్ని చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే.. అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

Night Cream
చలికాలాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ, ఈ కాలం అనేక సమస్యలను తెచ్చి పెడుతుంది. ఈ సమయంలో అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. జుట్టు, చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి. నిజానికి, చలికాలంలో మన చర్మం బాగా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. చల్లని గాలి, తేమ లేకపోవడం, పొడిబారడం వల్ల మన చర్మం సాగినట్లుగా అనిపిస్తుంది. దీని వల్ల వయసు మళ్లినవారిలా కనిపిస్తారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా మంది ఖరీదైన ఉత్పత్తులు కొనుగోలు చేసి.. ముఖానికి, చర్మానికి పూసేస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా ప్రయోజనం లేకపోతే.. ఇంట్లో తయారు చేసుకున్న ఒక సీరమ్ రాస్తే సరిపోతుంది. మరి, ఆ సీరమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...
వింటర్ సీరమ్...
చలికాలంలో అందాన్ని పెంచుకోవడానికి ఇంట్లోనే సీరమ్ తయారు చేసుకోవచ్చు. దాని కోసం గులాబీ రేకులు, కలబంద జెల్, గ్లిజరిన్, బాదం నూనె ఉంటే చాలు. ఇవన్నీ.. మన చర్మానికి లోతుగా పోషణ అందిస్తాయి. రోజ్ వాటర్ చర్మాన్ని రీఫ్రెష్ చేస్తుంది. కలబంద చర్మం పొడిబారే సమస్య తగ్గిస్తుంది. బాదం నూనె ముఖాన్ని యవ్వనంగా మారుస్తుంది.
సీరమ్ ఎలా తయారు చేయాలి..?
ముందుగా, తాజాగా గులాబీ పువ్వులను తీసుకొని వాటిని బాగా కడగాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని తీసుకొని మరిగించాలి. ఆ నీటిలో.. గులాబీ రేకులు కూడా వేసి 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత ఆ నీటిని ఫిల్టర్ చేసుకుంటే రోజ్ వాటర్ తయారైనట్లే. ఇప్పుడు ఒక శుభ్రమైన గిన్నెలో మూడు టీస్పూన్ల కలబంద జెల్, ఒక టీ స్పూన్ గ్లిజరిన్ , బాదం నూనె తీసుకోవాలి. తరవాత తయారు చేసుకున్న రోజ్ వాటర్ ని కూడా అందులో వేసి కలపాలి. ఈ పేస్టును బాగా కలిపి సీరమ్ అయ్యేంత వరకు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గాజు కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. అంతే.. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. నెల రోజుల పాటు.. దీనిని ప్రతిరోజూ ముఖానికి రాయడం వల్ల ఫేస్ లో గ్లో పెరుగుతుంది.

