MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Japanese Beauty Secret: గ్లోయింగ్ స్కిన్‌కు జపనీస్ బ్యూటీ టిప్

Japanese Beauty Secret: గ్లోయింగ్ స్కిన్‌కు జపనీస్ బ్యూటీ టిప్

Japanese Beauty Secret: జపాన్ బ్యూటీ సీక్రెట్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తోంది. ఇన్ స్టంట్ గ్లో కాకుండా లాంగ్ టైం బ్యూటీని కాపాడుకుంటున్నారు.  జెంటిల్ స్కిన్ కేర్, హెల్దీ ఫుడ్ తో పాటు క్రమశిక్షణ పాటించడం వల్ల మెరిసే చర్మంతో నిగనిగలాడిపోతున్నారు. 

3 Min read
Author : Nandini Arava
Published : Mar 02 2026, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
డీప్ హైడ్రేషన్, జెంటిల్ కేర్...జే బ్యూటీ మెయిన్ కాన్సెప్ట్
Image Credit : Asianet News

డీప్ హైడ్రేషన్, జెంటిల్ కేర్...జే బ్యూటీ మెయిన్ కాన్సెప్ట్

ఇప్పటి వరకు మన స్కిన్‌కేర్ రొటీన్ అంటే కెమికల్ పీల్, గట్టిగా పదే పదే రుద్దే స్క్రబ్‌లు, ఇన్ స్టంట్ గ్లో వంటివే గుర్తొచ్చేవి. ఇక Instant glow కోసం చర్మంపై రకరకాల ప్రయోగాలు చేసేస్తుంటారు. అప్పటికీ బాగానే ఉన్నా...తర్వాతర్వాత డ్యామేజ్ స్కిన్, రెడ్ నెస్, ఇరిటేషన్ తప్పదు. అందుకే ఇప్పుడు ప్రజల దృష్టి మారింది. ప్రెజెంట్ ట్రెండ్ ఏమిటంటే..జే-బ్యూటీ. అంటే జపనీస్ బ్యూటీ. అందుకే జపానోళ్ల స్కిన్ కేర్ పై మనసు పారేసుకుంటున్నారు. వాళ్ల పద్ధతులతో స్కిన్ పై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. అండ్ చర్మానికి గ్లోతో పాటు ప్రశాంతతను కూడా ఇస్తుంది. డీప్ హైడ్రేషన్, జెంటిల్ కేర్...ఇవే ఈ జే బ్యూటీ మెయిన్ కాన్సెప్ట్. 

26
మెరిసే చర్మం ఒక్కరోజులో రాలేదు
Image Credit : Getty

మెరిసే చర్మం ఒక్కరోజులో రాలేదు

జపాన్ మహిళల స్కిన్ మెరిసిపోవడానికి కారణం ఒక్క రోజులో అయిపోలేదు. మనలాగా వారు చర్మాన్ని ఇష్టమొచ్చినట్లు రుద్దేయరు. వాళ్లు స్కిన్ ను కూడా గౌరవిస్తారు. క్రమశిక్షణతో ఉంటారు. తినే ఫుడ్, వాడే ఉత్పత్తులు...అన్ని సహజ పదార్థాలనే వాడతారు. స్కిన్ రబ్ చేయడానికి Konjac root అనే వేరుజాతి మొక్కతో తయారైన స్పాంజ్ ను ఉపయోగిస్తారు. ఈ స్పాంజ్ చాలా మృదువుగా ఉండి స్కిన్ పై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. ఇది నీటిలో తడిపితే జెల్లీలా తయారవుతుంది. దీనివల్ల చర్మానికి ఇబ్బంది ఉండదు. పైగా ఇది ఎకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్ కావడం మరో ప్లస్ పాయింట్. 

Related Articles

Related image1
Beauty Tips: పగిలిన మడమలు మీ బ్యూటీని డామినేట్ చేస్తున్నాయా? ఇంట్లోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్
Related image2
Beauty tip: ఇదొక్కటి వాడితే పార్లర్ కు వెళ్లనక్కర్లేదు
36
రెడ్ నెస్ తగ్గిస్తుంది
Image Credit : Getty

రెడ్ నెస్ తగ్గిస్తుంది

జపాన్ వాళ్లు మాచా (Matcha) అనే గ్రీన్ టీ తాగుతారు. జపాన్‌లో ప్రసిద్ధి చెందిన ఒక ప్రత్యేకమైన గ్రీన్ టీ పొడి. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేస్తారు. మాచాలో శరీరానికి హానికరమైన కణాలను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. చర్మ సంరక్షణలో కూడా మాచాను ఉపయోగిస్తారు. ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మాన్ని ప్రశాంతంగా ఉంచి, రెడ్ నెస్ తగ్గించడంలో తోడ్పడుతుంది. 

46
శతాబ్దాలుగా ఈ నూనెను బ్యూటీ సిక్రెట్
Image Credit : our own

శతాబ్దాలుగా ఈ నూనెను బ్యూటీ సిక్రెట్

కమెలియా నూనె (Camellia Oil) వాడతారు. కమెలియా అనే మొక్క విత్తనాల నుంచి తీసే సహజ నూనె. జపాన్‌లో దీనిని సంప్రదాయంగా శరీర, చర్మ, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు. అక్కడి మహిళలు శతాబ్దాలుగా ఈ నూనెను బ్యూటీ సిక్రెట్ గా భావిస్తున్నారు. ఈ నూనెలో (ఒమేగా–9), లినోలిక్ ఆమ్లం, స్క్వాలీన్ వంటి చర్మానికి మేలు చేసే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన చర్మంలో సహజంగా ఉండే కొవ్వు పదార్థాలకు దగ్గరగా ఉండటం వల్ల చర్మం దీనిని సులభంగా గ్రహిస్తుంది. అందుకే స్కిన్ పై అంటుకున్నట్లు ఉండదు. కమెలియా నూనె చర్మానికి తేమను అందించి పొడిబారడాన్ని తగ్గిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. ముఖంపై కొద్దిగా రాసినా చాలు చర్మం మృదువుగా, తేమతో నిండినట్టుగా అనిపిస్తుంది.

56
చర్మ సంరక్షణలో కూడా దీనికి ప్రత్యేక స్థానం
Image Credit : our own

చర్మ సంరక్షణలో కూడా దీనికి ప్రత్యేక స్థానం

Yuzu (యుజు) అనేది జపాన్‌లో విరివిగా కనిపించే ఒక సిట్రస్ ఫ్రూట్. చిన్న నిమ్మకాయ లేదా బత్తాయి లాగా ఉంటుంది. జపాన్ వంటకాలలో మాత్రమే కాదు, చర్మ సంరక్షణలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. యుజు పండులో విటమిన్ C సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మంలో మచ్చలు తగ్గించడంలో, స్కిన్ టోన్ బ్రైట్ గా కనిపించడంలో సహాయపడుతుంది. మెరిసే చర్మంతో పాటు మృదుత్వాన్ని కాపాడుతుంది. 

66
ముడతలు తగ్గిస్తుంది
Image Credit : Getty

ముడతలు తగ్గిస్తుంది

Sakura Extract (సకురా) అనేది జపాన్‌లో ప్రసిద్ధి చెందిన చెర్రీ పుష్పాల నుంచి తీస్తారు. వసంతకాలంలో విరబూసే ఈ పూలు జపాన్ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. చర్మ సంరక్షణలో కూడా బెస్ట్ రిజల్ట్ చూపిస్తాయి. సకురా సారంలో చర్మానికి మేలు చేసే సహజ సంయోగాలు, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. స్కిన్ వదులుకాకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది. వయసు పెరిగేకొద్దీ కనిపించే ముడతలు, వాడిపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. 

జపాన్ బ్యూటీ లెసెన్ చెప్పోచ్చేది ఏంటంటే... నిజమైన అందం అనేది ఒక్కరోజులో వచ్చే మెరుపు కాదు, డైలీ లైఫ్ లో అదొక భాగం. ఆరోగ్యం కోసం మంచి ఫుడ్ ఎలా తీసుకుంటారో. దాంతో పాటు స్కిన్ కేర్ కోసం అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. గాఢమైన కెమికల్స్ తో స్కిన్ ను ఇబ్బంది పెట్టకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చర్మాన్ని కాపాడుకుంటారు. చర్మం లోపలి పొరలనుంచి ఎఫెక్ట్ ఉండేలా సహజ పద్ధతులు పాటిస్తారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
సౌందర్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Earrings: చిన్నారుల కోసం అద్భుతమైన డిజైన్ లో వెండి చెవిపోగులు
Recommended image2
Rashmika: బంగారం కాదు.. పెళ్లికి రష్మిక ధరించిన చెప్పుల ధర ఎంతో తెలుసా?
Recommended image3
Temple Jewellery: అదిరిపోయే డిజైన్ లో టెంపుల్ జ్యువెలరీ.. చూసేయండి
Related Stories
Recommended image1
Beauty Tips: పగిలిన మడమలు మీ బ్యూటీని డామినేట్ చేస్తున్నాయా? ఇంట్లోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్
Recommended image2
Beauty tip: ఇదొక్కటి వాడితే పార్లర్ కు వెళ్లనక్కర్లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved