MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Beauty Tips: పగిలిన మడమలు మీ బ్యూటీని డామినేట్ చేస్తున్నాయా? ఇంట్లోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్

Beauty Tips: పగిలిన మడమలు మీ బ్యూటీని డామినేట్ చేస్తున్నాయా? ఇంట్లోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్

Beauty Tips: పగిలిన మడమలు మీ అందాన్ని డామినేట్ చేస్తున్నాయా? ఖరీదైన క్రీమ్స్ ఉపయోగించినా ఫలితం లేదా? మనకు అవసరం లేదని పడేసే ఒక సాధారణ వస్తువే ఈ సమస్యకు పరిష్కారం కావచ్చు. మీ వంటగదిలో దాగి ఉన్న ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకోవాలనుందా?  

2 Min read
Author : Nandini Arava
Published : Feb 23 2026, 05:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పగిలిన మడమలతో ఇబ్బంది పడుతున్నారా?
Image Credit : Getty

పగిలిన మడమలతో ఇబ్బంది పడుతున్నారా?

ఎంత అందంగా రెడీ అయినా సరే చేతులు, కాళ్లు కూడా నీట్ గా ఉంటేనే...అందం మరింత రెట్టింపు అవుతుంది. కాళ్ల మడమలు పగిలినా, చేతులు ముడతలు పడినా కొంతమంది అసలూ పట్టించుకోరు. అలానే వెళ్లిపోతారు. దానివల్ల అది మీ అందాన్ని డామినేట్ చేస్తుంది. అందువల్ల అందరి చూపు దానిపైనే ఉంటుంది. ముఖ్యంగా కాళ్ల మడమలు పగిలినప్పుడు లైట్ తీసుకుంటారు. కొంతమంది బయటకు వెళ్లాలన్నా ఇష్టపడరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఖరీదైన ఫుట్ క్రీములు, లోషన్లు అక్కర్లేదు
Image Credit : Getty

ఖరీదైన ఫుట్ క్రీములు, లోషన్లు అక్కర్లేదు

బ్యూటీ విషయం పక్కనపెడితే ఈ చలికాలంలో పొడి చర్మం, ముఖంపై దద్దుర్లు, చర్మం రఫ్‌గా మారడం వంటి సమస్యలు సాధారణమే. అయితే వీటన్నింటికంటే ఎక్కువగా బాధించే సమస్య పగిలిన మడమలు. మడమలు పగిలిపోవడం వల్ల నడిచేటప్పుడు నొప్పి, చర్మం చిట్లిపోవడం, కొన్ని సందర్భాల్లో రక్తస్రావం కూడా జరుగుతుంది. అందం పరంగా కూడా ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చాలా మంది ఈ సమస్యకు పరిష్కారంగా ఖరీదైన ఫుట్ క్రీములు, లోషన్లు కొనుగోలు చేస్తుంటారు. కానీ సహజమైన, సులభమైన పరిష్కారం మన వంటగదిలోనే ఉందని చాలా మందికి తెలియదు.

34
వేరుశనగలే హీరో ఆఫ్ ది ఇంగ్రీడియంట్
Image Credit : Getty

వేరుశనగలే హీరో ఆఫ్ ది ఇంగ్రీడియంట్

మనము సాధారణంగా డస్ట్ బిన్ లో పడేసే వేరుశెనగ పెంకులు చర్మ సంరక్షణలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇవి సహజ నూనెలు, యాంటీఆక్సిడెంట్లు, చర్మానికి మేలు చేసే గుణాలతో నిండి ఉంటాయి. పాదాలపై పేరుకుపోయిన మృతకణాలను మృదువుగా తొలగించడంలో ఇవి సహాయపడతాయి. అలాగే చర్మానికి తేమను అందించి పొడి, దెబ్బతిన్న మడమలను మళ్లీ మృదువుగా మార్చడంలో చాలా చక్కగా పనిచేస్తాయి.

44
వేరుశెనగ పెంకులతో ఫుట్ రిపేర్ పేస్ట్
Image Credit : Getty

వేరుశెనగ పెంకులతో ఫుట్ రిపేర్ పేస్ట్

ఈ సహజ పేస్ట్ తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఎండిన వేరుశెనగ పెంకులను మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడికి ఒక చెంచా కొబ్బరి నూనె, అర చెంచా తేనె కలిపి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా పచ్చి పాలు వేసి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అంతే, సహజమైన ఫుట్ రిపేర్ పేస్ట్ సిద్ధం.

వాడే విధానం కూడా సులభమే. ముందుగా మీ పాదాలను గోరువెచ్చని నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టాలి. దీంతో చర్మం మెత్తబడుతుంది. తర్వాత తయారు చేసిన పేస్ట్‌ను పగిలిన మడమలపై అప్లై చేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు మృదువుగా మసాజ్ చేయాలి. ఆపై మరో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ వేసుకోవాలి. వారానికి 2 , 3 సార్లు చేస్తే, కొద్ది రోజుల్లోనే పగిలిన మడమలు తగ్గి పాదాలు మృదువుగా అయిపోతాయి. సహజ పదార్థాలతో చేయడం వల్ల సురక్షితమైనదే కాకుండా ఖర్చు కూడా తక్కువే.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Beauty tips: ముఖాన్ని 7 రోజుల్లో మెరిపించడానికి ఈ చిన్న చిట్కాలు పాటించండి చాలు
Recommended image2
Beauty Tips: శనగపిండిలో నెయ్యి కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుంది? డాక్టర్లు ఏమంటున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved