- Home
- Life
- Woman
- Hair Care: జుట్టు రాలడం మొదలవ్వగానే ఇదొక్కటి రాస్తే.. మళ్లీ ఒక్క వెంట్రుక కూడా రాలదు..!
Hair Care: జుట్టు రాలడం మొదలవ్వగానే ఇదొక్కటి రాస్తే.. మళ్లీ ఒక్క వెంట్రుక కూడా రాలదు..!
బియ్యం కడిగిన నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి, జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి.

జుట్టు రాలడం తగ్గాలా..?
జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. జుట్టు రాలడానికి ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోకపోవడం, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండటం, కాలుష్యం, కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు వాడటం ఇలా కారణం ఏదైనా కావచ్చు. కానీ.. కొందరికి ఇలాంటి సమస్యలు ఏమీ లేకపోయినా కూడా జుట్టు రాలుతుంది. మరి కొందరికి జుట్టు రాలదు కానీ... అలా అని ఒత్తుగా, పొడుగ్గా కూడా పెరగదు. చుండ్రు, దురద తో పాటు.. చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటివారు కేవలం హోం రెమిడీలు వాడితే చాలు. ఈ జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో తెలుసుకుందాం....
జుట్టుకు బియ్యం కడిగిన నీరు...
బియ్యం కడిగిన నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి, జుట్టును బలంగా, ఒత్తుగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు.. జుట్టు ను చాలా మృదువుగా మారుస్తాయి. వేగంగా పెరగడానికి సహాయపడతాయి. హెయిర్ ఫాల్ ని కూడా కంట్రోల్ లో ఉంచడంలోనూ హెల్ప్ చేస్తాయి. ఈ బియ్యం నీటితో పాటు మెంతులు కూడా వాడితే.. జుట్టు మరింత ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. మరి, ఆ బియ్యం, మెంతుల నీటిని జుట్టుకు ఎలా అప్లై చేయాలి?
బియ్యం, మెంతులు..
ముందుగా బియ్యం ని రెండు గ్లాసుల నీరు పోసి నానపెట్టాలి. మెంతులను కూడా నీటిలో నానపెట్టాలి. రాత్రంతా వీటిని సపరేటుగా నానపెట్టాలి.ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని అందులో రెండు చెంచాల నానబెట్టిన మెంతులు వేసి.. మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్రను స్టవ్ మీద ఉంచి, మనం తీసుకున్న బియ్యం కడిగిన రెండు కప్పుల నీరు , రెండు స్పూన్ల మెంతుల పేస్టు వేసి బాగా మరిగించండి. అది చిక్కబడే వరకు కలుపుతూ ఉండండి. బియ్యం కడిగిన నీరు, మెంతులు రెండూ జుట్టు రాలడం సమస్యను పరిష్కరిస్తాయి. జుట్టు మందంగా, వేగంగా పెరగడానికి సహాయపడతాయి. చుండ్రు సమస్య, అన్ని జుట్టు సమస్యలను నయం చేస్తాయి.
ఈ నీటిని జుట్టుకు ఎలా ఉపయోగించాలి?
బాగా ఉడికించిన బియ్యం కడిగిన నీరు, మెంతి పేస్ట్‌ను ఫిల్టర్ చేసి తీసుకోవాలి. దీనిని వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేయాలి, లేకుంటే అది చాలా మందంగా మారుతుంది. ఫిల్టర్ చేసిన తర్వాత, మీరు మిగిలిన మెంతుల పేస్ట్‌ను పారవేయకుండా.. మీ ముఖంపై ఉన్న మొటిమలు ఉన్న ప్రదేశంలో కూడా రాయవచ్చు. ఈ మచ్చలను కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా, బ్లాక్‌హెడ్స్ కూడా నయమవుతాయి. దీని తర్వాత, ఫిల్టర్ చేసిన మిశ్రమంలో విటమిన్ ఇ మాత్రలు తీసుకొని లోపల ఉన్న జెల్‌ను మాత్రమే తీసుకొని కలపండి. కొద్దిగా ఆముదం జోడించండి. ఆముదం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి కొంతమందికి ఇది ఇష్టం ఉండదు. ఇష్టపడని వారు ఆముదం నూనెకు బదులుగా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను జోడించవచ్చు.
వారానికి రెండుసార్లు..
కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. వీటన్నింటినీ బాగా కలపండి. ఇప్పుడు దీన్ని మీ తలపై అప్లై చేసి 10 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. దీని తర్వాత, అరగంట పాటు అలాగే ఉంచండి. అరగంట తర్వాత, షాంపూ లేదా కండిషనర్‌తో మీ జుట్టును బాగా కడగాలి. వారానికి రెండుసార్లు దీన్ని ఉపయోగించడం వల్ల అన్ని రకాల జుట్టు సమస్యలు నయమవుతాయి.