Hair Care: జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలా? ఈ నూనె రాస్తే చాలు!
Olive Oil for Hair Growth: జుట్టు ఒత్తుగా, బలంగా ఉండాలని చాలామంది కోరుకుంటుంటారు. కానీ, పలు సమస్యలు జుట్టురాలడానికి కారణమవుతున్నాయి. ఈ సమస్యకు ఆలివ్ అయిల్ తో చెక్ పెట్టవచ్చు. ఇంతకీ జట్టు పెరగడానికి ఆలివ్ ఆయిల్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఆలివ్ ఆయిల్
జట్టు రాలిపోవడం అనేది సాధారణ సమస్య. ఈ సమస్య చాలామందిలో ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్య ఇలానే కొనసాగితే.. బట్టతల వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో వివిధ రకాల నూనెలను కొనుగోలు చేసి ఉపయోగిస్తారు. వాటిలో ఒకటి ఆలివ్ ఆయిల్. ఈ నూనెలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి వెంట్రుకలు రాలిపోయిన చోట ఈ ఆయిల్ అప్లై చేసే.. వేగంగా జట్టు పెరుగుతుందట. ఇంతకీ ఆలివ్ ఆయిల్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
తేనె, ఆలివ్ ఆయిల్ :
ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో ఒక స్పూన్ తేనె కలిపి బట్టతలపై రాసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. తేనెలోని యాంటీ అలెర్జీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తలలోని ఇన్ఫెక్షన్‌ను తొలగిస్తాయి. దీని వల్ల జట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
ఉల్లిపాయ రసం, ఆలివ్ ఆయిల్ :
ఒక స్పూన్ ఉల్లి రసంలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి బట్టతలపై ఆప్లై చేయండి. 30 నిమిషాల తరువాత షాంపూతో తలస్నానం చేయండి. ఉల్లి రసంలో ఉండే సల్ఫర్ వెంట్రుకలు రాలడాన్ని తగ్గించి, కొత్త వెంట్రుకలు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
గుడ్డు, ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ :
గుడ్డులోని తెల్లసొనలో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ బాగాా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని హెయిర్ కు ఆప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉండండి. ఆ తరువాత షాంపూతో తలస్నానం చేయండి. గుడ్డులోని పచ్చసొనలో ఉండే ప్రోటీన్, విటమిన్లు, బయోటిన్ వెంట్రుకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. జట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.
కలబంద గుజ్జు, ఆలివ్ ఆయిల్ :
2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో 1 స్పూన్ కలబంద గుజ్జును కలిపి బట్టతలపై రాసి ఒక గంట తరువాత సాప్ట్ షాంపూతో తలస్నానం చేయండి. కలబంద గుజ్జు ఆరోగ్యకరమైన వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇలా వారానికి ఒక్కసారి చేయండి. మంచి ఫలితాలు వస్తాయి.
గమనిక: పైన చెప్పిన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తేనే బట్టతలపై వెంట్రుకలు పెరుగుతాయి. ఇది కాకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం.