MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Paper Bag Hack: Blinkit, Zepto పేపర్ బ్యాగ్స్ పారేస్తున్నారా? వాటితో ఇంటిని అందంగా మార్చేయచ్చు

Paper Bag Hack: Blinkit, Zepto పేపర్ బ్యాగ్స్ పారేస్తున్నారా? వాటితో ఇంటిని అందంగా మార్చేయచ్చు

Paper Bag Hack: ఇంట్లో పేపర్ బ్యాగ్స్ ఉన్నాయా? వాటితో ఏం అవసరం ఉంటుందిలే అని పడేస్తున్నారా? కానీ, ఆ పేపర్ బ్యాగ్స్ తోనే మీ ఇంటిని అందంగా మార్చేసుకోవచ్చు. వాటిని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం…

2 Min read
Author : ramya Sridhar
Published : May 30 2026, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Paper Bag Hack
Image Credit : chat gpt

Paper Bag Hack

ఈ రోజుల్లో ప్రతి చిన్న అవసరానికి మనలో చాలా మంది ఆన్ లైన్ స్టోర్స్ పై ఆధారపడుతున్నారు.  ముఖ్యంగా కూరగాయలు, పండ్లు లాంటి వాటిని కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. అయితే.. బ్లింకిట్, జెప్టో వంటి స్టోర్స్ లో మనకు కావాల్సినవి ఆర్డర్ చేసినప్పుడు  డెలివరీ బాయ్స్ పేపర్ బ్యాగ్ లో వాటిని మనకు డెలివరీ చేస్తారు. అయితే… మనం.. మనకు కావాల్సిన సామాగ్రి తీసుకొని… ఆ పేపర్ బ్యాగ్స్ ని మాత్రం పడేస్తూ ఉంటాం. పేపర్ బ్యాగ్స్ తో  ఉపయోగం ఏం ఉంటుందిలే అని అనుకుంటాం. కానీ…  వాటిని పడేయకుండా చాలా రకాలుగా ఉపయోగించొచ్చు. ముఖ్యంగా.. ఇంటిని అందంగా మార్చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం….

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పేపర్ బ్యాగ్ తో స్టోరేజ్ బాస్కెట్లు...
Image Credit : chat gpt

పేపర్ బ్యాగ్ తో స్టోరేజ్ బాస్కెట్లు...

Zepto, Blinkit పేపర్ బ్యాగులు మరీ పలచగా ఏమీ ఉండవు.  మందంగా ఉంటాయి.  ఈ పేపర్ బ్యాగ్స్ ఉపయోగించి మరీ.. స్టోరేజ్ బాస్కెట్లు తయారు చేసుకోవచ్చు.  లేస్ లేదా జ్యూట్ తాడుతో అలంకరించి అందమైన స్టోరేజ్ బాస్కెట్లుగా తయారు చేయచ్చు. వీటిలో మీ పిల్లల బొమ్మలు, మేకప్ సామాగ్రి, లేదా చిన్న చిన్న ఇంట్లోకి వాడే వస్తువులు సర్దుకోవచ్చు. దీని వల్ల ఇల్లు నీట్ గా కనిపిస్తుంది. ఈ స్టోరేజ్ బాక్స్ లు కూడా అందంగా కనపడతాయి.

36
కిచెన్ కోసం పేపర్ ఆర్గనైజర్..
Image Credit : chat gpt

కిచెన్ కోసం పేపర్ ఆర్గనైజర్..

మీ వంట గదిలో చిన్న ప్యాకెట్లు, మసాలాలు లేదా రెసిపీ నోట్స్ చిందరవందరగా పడి ఉంటున్నాయా? అయితే… మీ పేపర్ బ్యాగులతో వాల్ ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు.  వీటిని గోడకు తగిలించి కిచెన్ కు మరింత క్లీన్, అందమైన లుక్ ఇవ్వొచ్చు.  కావాలంటే… వాటిపై పెయింటింగ్ లేదా స్టిక్కర్లు కూడా అంటించొచ్చు.

46
గిఫ్ట్ బ్యాగ్, ఫెస్టివల్ ప్యాకింగ్ కోసం...
Image Credit : chat gpt

గిఫ్ట్ బ్యాగ్, ఫెస్టివల్ ప్యాకింగ్ కోసం...

ఈ బ్యాగులను ఫ్యాన్సీ రిబ్బన్లు, చేతితో చేసిన ట్యాగ్‌లు, డ్రై ఫ్లవర్స్‌తో అలంకరించి యూనిక్ గిఫ్ట్ బ్యాగులుగా మార్చవచ్చు. పుట్టినరోజులు, పండుగలు లేదా చిన్న చిన్న బహుమతులు ఇవ్వడానికి ఈ ఐడియా చాలా ట్రెండీగా ఉంటుంది. దీనివల్ల గిఫ్ట్ ప్యాకింగ్‌పై ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి మేలు చేసినట్టు కూడా ఉంటుంది.

56
టేబుల్ ప్లాంటర్ కవర్‌గా మార్చండి
Image Credit : chat gpt

టేబుల్ ప్లాంటర్ కవర్‌గా మార్చండి

మీ ఇంట్లో చిన్న ఇండోర్ ప్లాంట్స్ ఉంటే, ఈ పేపర్ బ్యాగులను ప్లాంటర్ కవర్‌లా ఉపయోగించవచ్చు. బ్యాగులపై సింపుల్ డిజైన్లు వేసి లేదా పాస్టెల్ రంగులతో పెయింట్ చేసి మోడ్రన్ హోమ్ డెకార్ లుక్ తీసుకురావచ్చు. ఈ ఐడియా లివింగ్ రూమ్, బాల్కనీ రెండింటికీ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

66
పిల్లల కోసం DIY క్రాఫ్ట్ ఐటమ్స్
Image Credit : chat gpt

పిల్లల కోసం DIY క్రాఫ్ట్ ఐటమ్స్

ఈ పేపర్ బ్యాగులతో పెన్ స్టాండ్‌లు, బుక్ కవర్లు, పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్, చిన్న స్టోరేజ్ బాక్సుల వంటి ఎన్నో క్రాఫ్ట్ వస్తువులను తయారు చేయవచ్చు. దీనివల్ల పిల్లలలో సృజనాత్మకత పెరగడమే కాకుండా, పాత వస్తువులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా నేర్చుకుంటారు. సెలవుల్లో ఇది ఒక మంచి DIY యాక్టివిటీగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!
Recommended image2
Coriander Water: ధనియాల నీరు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది, ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Mutton Biryani: రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ.. వంట రాని వాళ్లు కూడా ఈజీగా చేసేయొచ్చు!
Related Stories
Recommended image1
Old Sarees: పాత చీరలు పారేస్తున్నారా? వాటితోనే ఇంటి అలంకరణ...ఎలాగంటే?
Recommended image2
Old Bedsheets: పాత బెడ్ షీట్ల‌ను ప‌డేయ‌కండి.. ఇలా చేస్తే డ‌బ్బులు ఆదా, ఇంటికీ స్టైలిష్ లుక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved