Hair Care: 15 రోజుల్లో రాలిన జుట్టు మళ్లీ పెరగాలా? ఇదొక్కటి రాస్తే చాలు..!
జుట్టు బాగా రాలుతోందా? మార్కెట్లో దొరికే ఖరీదైన నూనెలు, షాంపూలు వాడినా కూడా ఈ జుట్టు రాలడం తగ్గడం లేదా? అయితే, ఈ ఉల్లిపాయ నూనె రెమిడీ కచ్చితంగా ప్రయత్నించాల్సిందే.
- FB
- TW
- Linkdin
Follow Us

జుట్టు రాలడం తగ్గాలంటే..
ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది చాలా మంది ఎదుర్కొంటున్న కామన్ సమస్య. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండాఅందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. కొంత మందికి చాలా ఎక్కువగా జుట్టు రాలుతూ ఉంటుంది. దీని వల్ల చాలా చిన్న వయసులోనే బట్టతల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.మీరు కూడా అలాంటి సమస్యను ఫేస్ చేస్తున్నారా? అయితే... కేవలం 15రోజుల్లోనే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
ఉల్లిరసంతో నూనె..
మనం ఇంట్లోనే ఒక హెర్బల్ నూనె వాడటం వల్ల... జుట్టురాలే సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. ఈ ఆయిల్ తయారు చేయడానికి రెండు చిన్న ఉల్లిపాయలు, ఒక టీ స్పూన్ ఆముదం, రెంటు టీ స్పూన్ల కొబ్బరి నూనె, ఒక టీ స్పూన్ ఆవాల నూనె ఉంటే సరిపోతుంది.
నూనె తయారుచేసే విధానం...
రెండు చిన్న ఉల్లిపాయలను తీసుకొని దానిమీద తొక్క తీయాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి, తర్వాత ముక్కలుగా కోయాలి. ఈ ఉల్లిముక్కలను ఒక టీ స్పూన్ ఆలివ్ నూనెలో వేసి కలపాలి. దీనిని రాత్రంతా అందులోనే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం అందులో రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను జోడిస్తే సరిపోతుంది. దీనికే ఒక టీ స్పూన్ ఆవాల నూనె కూడా చేర్చాలి. వీటన్నింటినీ బాగా కలపాలి. తర్వాత ఒక పెద్ద కుండలో నీరు పోసి మరిగించాలి. ఆ మరుగుతున్న నీళ్లల్లో మనం తయారు చేసుకున్న నూనె పాత్రను కూడా ఉంచాలి. అలా వేడి చేసిన నూనెను మన జుట్టు కుదుళ్లకు మంచిగా రాయాలి. నెమ్మదిగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత సల్ఫేట్ లేని షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ..
ఉల్లిపాయ రసం వాడటం అనేది జుట్టు సంరక్షణకు పురాతనమైన , ప్రభావవంతమైన పద్ధతి. దీని ఉపయోగం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయలలో సల్ఫర్ ఉంటుంది, ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. సల్ఫర్ జుట్టు మూలాలను పోషిస్తుంది. కొత్త జుట్టు పెరుగుదల ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది యాంటీ ఫంగల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రు , స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇందులో జుట్టు మూలాలను బలోపేతం చేసే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఉంటాయి. అలాగే, ఉల్లిపాయ రసాన్ని తలకు పూయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు మూలాలకు ఎక్కువ పోషణను అందిస్తుంది. దీని రసంలో సహజ కండిషనింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది జుట్టును మృదువుగా , మెరిసేలా చేస్తుంది.
హెయిర్ మాస్క్..
కేవలం ఉల్లిపాయ రసం తో చేసిన నూనె మాత్రమే కాకుండా.. ఈ కింది హెయిర్ మాస్క్ లు ప్రయత్నించినా కూడా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.
ఉల్లిపాయ రసం , తేనె
ఉల్లిపాయను తొక్క తీసి తురిమి.. రసాన్ని తీయండి.ఉల్లిపాయ రసంలో తేనె వేసి బాగా కలపండి.ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి 30 నిమిషాలు అలాగే ఉంచండి.తర్వాత తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగాలి.
ప్రయోజనాలు: తేనె తలకు తేమను అందిస్తుంది. ఉల్లిపాయ రసంతో కలిపి రాయడం వల్ల జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉల్లిపాయ రసం , పెరుగు హెయిర్ మాస్క్..
ఉల్లిపాయను తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో రుబ్బుకోవాలి.ఉల్లిపాయ రసాన్ని పిండి, దానికి పెరుగు కలపండి.ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి 30 నిమిషాలు అలాగే ఉంచండి.తరువాత షాంపూతో కడగాలి.
ప్రయోజనాలు: పెరుగు తలకు చల్లబరుస్తుంది. ఉల్లిపాయ రసం జుట్టుకు పోషణనిస్తుంది.