MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Tips
  • Hair Growth tips: ఈ ఒక్క ఆయిల్ వాడితే చాలు.. జుట్టు రాలమన్నా రాలదు!

Hair Growth tips: ఈ ఒక్క ఆయిల్ వాడితే చాలు.. జుట్టు రాలమన్నా రాలదు!

ప్రస్తుతం చాలామంది రకరకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటి నివారణకు ఖరీదైన ప్రోడక్టులు వాడుతున్నారు. కానీ ఈ ఒక్క నూనెతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ నూనెంటో.. ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : Jul 07 2025, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నల్ల మిరియాల నూనె

నల్ల మిరియాల నూనె

నల్లమిరియాల నూనె.. జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.  ఈ నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. చుండ్రును తగ్గించి, జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జుట్టు పెరుగుదలకు...

జుట్టు పెరుగుదలకు...

నల్ల మిరియాల నూనెలో పైపెరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి.. పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బట్టతలపై ఈ నూనెను రోజూ రాస్తే జుట్టు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

34
చుండ్రు తగ్గడానికి..

చుండ్రు తగ్గడానికి..

నల్ల మిరియాల నూనె.. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రును ప్రభావవంతంగా తగ్గించడంలో సహాయపడుతుంది. తలపై చర్మాన్ని శుభ్రంచేసి.. చుండ్రు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. 

మృదువైన జుట్టు..

నల్ల మిరియాల నూనెలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేసి.. రాలడాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు జుట్టును మృదువుగా చేయడంలో సహాయడపడతాయి.

44
నల్ల మిరియాల నూనెను ఎలా వాడాలి:

నల్ల మిరియాల నూనెను ఎలా వాడాలి:

  • కొద్దిగా నల్ల మిరియాల నూనెను తీసుకొని తలకు పట్టించి మృదువుగా మసాజ్ చేయాలి. ఒకటి లేదా 2 గంటల తర్వాత షాంపూతో కడిగేయాలి.  
  • నల్ల మిరియాల నూనెను కొంచెం కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ తో కలిపి పెట్టుకోవచ్చు. ముందుగా ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఆ తర్వాత షాంపూతో కడిగేయాలి.  
  • నల్ల మిరియాల నూనెను పెరుగు లేదా తేనె, గుడ్డుతో కలిపి హెయిర్ మాస్క్ గా వాడచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.  

ఇది గుర్తుంచుకోండి: 

ఈ నూనెను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. చికాకు లేదా దురద అనిపిస్తే.. వాడకపోవడమే మంచిది.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
మహిళలు
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Recommended image2
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Recommended image3
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Related Stories
Recommended image1
Hair growth: జుట్టు రాలడం వెంటనే ఆగిపోవాలంటే.. ఇదొక్కటి పెడితే చాలు!
Recommended image2
Onion Juice for Hair Growth: ఉల్లి రసాన్ని ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved