Skin Care: కీరదోసకాయను ఇలా పెడితే మీ ముఖం మీదున్న మచ్చలు పోయి మెరిసిపోతుంది
Skin Care: ముఖంమీద మచ్చలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఈ మచ్చలు పోవడానికి కీరదోసకాయ బాగా సహాయపడుతుంది. దీన్ని కొన్ని పద్దతుల్లో ముఖానికి పెడితే మచ్చలు పోయి ముఖం అందంగా మెరిసిపోతుంది. అదెలాగంటే?

కీరదోసకాయ
మన వంటింట్లో ఉండే కీరదోసకాయలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది. దీన్ని ఫేస్ ప్యాక్ గా వేసుకుంటే ఎన్నో చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఇది మన ముఖానికి నేచురల్ గ్లో ను ఇస్తుంది. కీరదోసకాయలో 95 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది మన చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తుంది. అలాగే చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. మరి దీన్ని ఎలా ఫేస్ ప్యాక్ వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కీరదోసకాయ ఫేస్ టోనర్
ఇందుకోసం కీరదోసకాయ రసం తీయాలి. దీనిలో కొంచెం రోజ్ వాటర్ ను మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో నింపి ముఖానికి స్ప్రే చేయాలి. దీన్ని రోజుకు రెండు మూడు సార్లు ఉపయోగించొచ్చు. ఇది చర్మాన్ని రీఫ్రెష్ చేస్తుంది. అలాగే చర్మ రంధ్రాల్లో మురికి లేకుండా చేయడానికి సహాయపడుతుంది.
డార్క్ సర్కిల్స్, కళ్లు ఉబ్బడం
కీరదోసకాయలో మనం డార్క్ సర్కిల్స్ , కళ్ల వాపును తగ్గించుకోవచ్చు. ఇందుకోసం కీరదోసకాయను ఫ్రిజ్ పెట్టి చల్లగా అయిన తర్వాత సన్నని ముక్కలుగా కోయాలి. దీన్ని కళ్లపై 15 నుంచి 20 నిమిషాలు పెట్టాలి. ఈ చల్లదనం వల్ల కంటివాపు తగ్గుతుంది. దీన్నీ ప్రతిరోజూ వాడితే డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయి.
కీరదోసకాయ, కలబంద ఫేస్ ప్యాక్
కీరదోసకాయ, కలబంద ఫేస్ ప్యాక్ కూడా చర్మానికి మంచి మేలు చేస్తుంది. దీన్ని వాడటం వల్ల ముఖానికి మంచి గ్లో వస్తుంది. దీన్ని తయారుచేయడానికి టీ స్పూన్ కీరదోసకాయ పేస్ట్ లో టీ స్పూ స్పూన్ కలబంద జెల్ ను వేసి బాగా మిక్స్ చేయండి. దీన్ిన ముఖానికి పెట్టండి. దీన్ని 20 నిమిషాల తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి. ఈ ప్యాక్ చర్మ చికాకును తగ్గిస్తుంది.
కీరదోసకాయ, పెరుగు ఫేస్ ప్యాక్
ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ బాగా సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి రెండు టీ స్పూన్ల కీరదోసకాయ పేస్ట్ లో రెండు టీ స్పూన్ల పెరుగును వేసి కలపండి. దీన్ని ముఖానికి పెట్టి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది చర్మంలోని అదనపు నూనెను తొలగించి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
కీరదోసకాయ, నిమ్మకాయ ఫేస్ స్క్రబ్
కీరదోయకాయ, నిమ్మకాయ ఫేస్ స్క్రబ్ స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. దీన్ని తయారుచేయడానికి కీరదోసకాయ పేస్ట్ లో సగం టీ స్పూన్ నిమ్మరసం, కొంచెం చక్కెరను వేసి కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి రెండు మూడు నిమిషాల మసాజ్ చేయండి. దీనివల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. ముఖం అందంగా మెరిసిపోతుంది. అలాగే మీరు కీరదోసకాయ ముక్కలను డైరెక్ట్ గా కూడా ముఖానికి రుద్దొచ్చు. ఇది వెంటనే మీ ముఖం మెరిసిసేలా చేస్తాయి. స్కిన్ ను హైడ్రేట్ గా చేస్తుంది.