Skipping : జస్ట్ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేసినా బరువు తగ్గడంతో పాటు ఎన్నో లాభాలున్నాయి
Skipping : బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేసినా కూడా మీరు సులువుగా బరువు తగ్గుతారు. అంతేకాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్కిప్పింగ్ ప్రయోజనాలు
స్కిప్పింగ్ ను చిన్నప్పుడు ఎక్కువగాా ఆడుతుంటారు. స్కూల్ లో కూడా దీన్ని ఎక్కువగా ఆడిస్తుంటారు. కానీ ఇది ఇప్పుడు ఒక వ్యాయామంలో భాగంగా మారింది. నిజానికి ఎఫెక్టీవ్ వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒకటి. చాలా తక్కువ టైంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఈ వ్యాయామం బాగా సహాయపడుతుంది. అంతేకాదు స్కిప్పింగ్ వల్ల మొత్తం శరీరం హెల్తీగా ఉంటుంది. అసలు రోజూ ఒక 15 నిమిషాలు వ్యాాయామం చేయడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వెయిట్ లాస్
బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ వ్యాయామం అనే చెప్పాలి. ఎందుకంటే రెగ్యులర్ గా స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో అదనపు ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే మీరు ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే 300 కేలరీలను కరిగించగలుగుతారు. వెయిట్ లాస్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎక్సర్ సైజ్.
గుండె ఆరోగ్యం
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా స్కిప్పింగ్ సహాయపడుతుంది. మీరు గనుక ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే గుండె కండరాలు బలంగా అయ్యి హర్ట్ కు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఎముకలు బలంగా ఉంటాయి
వయసు పెరుగుతున్న కొద్దీ మన ఎముకల సంద్రత తగ్గుతుంది. అయితే మీరు స్కిప్పింగ్ చేస్తే ఎముకలు బలంగా ఉంటాయి. ఇది ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది.
మెదడు ఆరోగ్యానికి
ప్రతి రోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ స్కిప్పింగ్ చేయడంవల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది.
ఊపిరితిత్తుల ఆరోగ్యం
స్కిప్పింగ్ చేయడం వల్ల శ్వాస సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది కండరాలకు ఆక్సిజన్, రక్తాన్ని బాగా పంపు చేయడానికి సహాయపడుతుంది. దీంతో మీ గుండె కొట్టుకునే వేగం, శ్వాస రేటు పెరుగుతాయి. దీంతో మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అంటే స్కిప్పింగ్ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది
నేడు చాలా మంది ఒత్తిడి, యాంగ్జైటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే మీరు గనుక ప్రతిరోజూ 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీంతో మీరు ప్రశాంతంగా ఉంటారు.