Hair Care: ఈ హెయిర్ సీరమ్ రాసినా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!
ఇంట్లో తయారు చేసిన ఒక సీరమ్ వాడినా మీ జుట్టు పట్టుకుచ్చులా మారడంతో పాటు, జుట్టు ఒత్తుగా నల్లగా నిగనిగలాడేలా చేసుకోవచ్చు.

ఈ మధ్యకాలంలో జుట్టురాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడమే కాదు, చుండ్రు కూడా కామన్ అయిపోయింది. ఈ సమస్యలకు కారణాలు చాలానే ఉండొచ్చు. ఒత్తిడి, కాలుష్యం,పోషకాహారలోపం, రసాయనాలు ఉన్నషాంపూలు వాడకం ఇలా చాలా కారణాలు ఉన్నాయి. వీటి కారణంగా తలలో చుండ్రు సమస్య పెరగడం, చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి, ఆ సమస్యలు తగ్గి.. జుట్టు అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చని మీకు తెలుసా? అలా మార్చుకోవడానికి ఖరీదైన క్రీములు, షాంపూలు వాడాలి అని చాలా మంది అనుకుంటారు.కానీ.. ఇంట్లో తయారు చేసిన ఒక సీరమ్ వాడినా మీ జుట్టు పట్టుకుచ్చులా మారడంతో పాటు, జుట్టు ఒత్తుగా నల్లగా నిగనిగలాడేలా చేసుకోవచ్చు. మరి, ఆ సీరమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా...
సీరమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు...
బియ్యం 2 స్పూన్లు, మెంతులు 2 స్పూన్లు, కలౌంజి( నల్ల జీలకర్ర) ఒక స్పూన్, నీరు – 1 గ్లాసు,ఎండిన గోరింటాకుల పొడి – 2 స్పూన్లు,రోజ్‌మెరీ ఆకులు – 1 స్పూన్, విటమిన్ E క్యాప్సూల్స్ – 2
తయారీ విధానం:
ముందుగా రాత్రిపూట బియ్యం, మెంతులు, కలౌంజిని నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు వాటిని అదే నీటిలో మరిగించండి. తర్వాత అందులో గోరింటాకులు, రోజ్‌మెరీ ఆకులు వేసి నీరు సగం అయ్యేవరకు మరిగించాలి. మిశ్రమాన్ని వడకట్టి, విటమిన్ E క్యాప్సూల్స్ నూనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నిల్వ చేయాలి.
వాడక విధానం:
ఈ సీరంను రోజుకు ఒక్కసారి లేదా రెండు సార్లు జుట్టు రూట్స్‌కి స్ప్రే చేసి, మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. నల్లగ నిగనిగలాడుతుంది. కనీసం నెలరోజుల పాటు ఈ సీరమ్ జుట్టుకు రాసినా జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలని వేగవంతం చేసి, సహజ మెరుపును తీసుకురావడంలో సహాయపడుతుంది.
ఈ సీరంను నిరంతరంగా వాడితే జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతుంది. ఇంకా ఫలితాలు మెరుగ్గా రావాలంటే, మంచి ఆహారం, నీటి తాగుట, మంచి నిద్ర కూడా అవసరం.జుట్టు పెరుగుదలకు సహాయపడే అన్ని రకాల ఆహారాలను డైట్ లో కచ్చితంగా భాగం చేసుకోవాలి