Hair Care: చలికాలంలో తలకు నూనె ఎలా రాయాలో తెలుసా?
Hair Care: రెగ్యులర్ ఆయిల్ మసాజ్ కంటే, నూనెను కొద్దిగా వేడి చేసి తలకు మసాజ్ చేయడం వల్ల నూనె లోని పోషకాలు జుట్టులోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఫలితంగా పొడి జుట్టు సమస్య తగ్గి, జుట్టు అందంగా కనిపిస్తుంది..

Hair Care
జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి రెగ్యులర్ గా మనం నూనె రాస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా చలి కాలంలో జుట్టు చాలా పొడిగా మారుతూ ఉంటుంది. చర్మానికి మాయిశ్చరైజర్ ఎలాగో.. జుట్టుకు తేమ, పోషణ అవసరం. అందుకే.. మన పూర్వీకులు పురాతన కాలం నుంచి జుట్టుకు నూనె రాస్తూ వచ్చేవారు. అయితే... నార్మల్ గా కాకుండా ఆ కొబ్బరి నూనెను వేడి చేసి.. జుట్టుకు అప్లై చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నూనెను కొద్దిగా వేడి చేసి... గోరు వెచ్చగా ఉన్నప్పుడు.. ఆ నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పొడిగా మారదు. ఆల్రెడీ పొడిగా మారినా కూడా ఇలా నూనె అప్లై చేయడం వల్ల.. జుట్టు మళ్లీ మృదువుగా మారుతుంది. అంతేకాదు.. చాలా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం....
జుట్టును బలపరుస్తుంది...
రెగ్యులర్ గా గోరు వెచ్చని నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా మారుతుంది. బలంగా కూడా మారుతుంది. రెగ్యులర్ గా జుట్టుకు హీట్ ప్రొడక్ట్స్ లేదా, స్టైలింగ్ చేసే అలవాటు ఉన్నవారు.. ఇలా నూనె రాయడం వల్ల… హెయిర్ డ్యామేజ్ ఉండదు. జుట్టు అందంగా మారుతుంది.
దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది....
వేడి నూనెను జుట్టుకు మసాజ్ చేయడం వల్ల దెబ్బ తిన్న జుట్టును రిపేర్ చేస్తుంది. జుట్టును చాలా మృదువుగా మారుస్తుంది. ఎలాంటి ఖరీదైన చికిత్స అవసరం లేకుండా కూడా మీ జుట్టు అందంగా మెరుస్తూ కనపడుతుంది.
3. జుట్టు చిట్లిపోవడం తగ్గిపోతుంది...
జుట్టు చిట్లి పోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది. దీని కోసం చాలా మంది హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే... మీరు గోరు వెచ్చని నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఈ జుట్టు చివరలు చిట్లిపోవడం ఆగిపోతుంది. మళ్లీ తిరిగి జుట్టు పెరగడం మొదలౌతుంది.
పొడి జుట్టుకు తేమను అందిస్తుంది:
చలికాలంలో చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు ఆ చుండ్రు తగ్గించుకోవడానికి ఏవేవో షాంపూలు వాడుతూ ఉంటారు. వాటితో అవసరం లేకుండా... ఈ గోరు వెచ్చని కొబ్బరి నూనె వాడితే చాలు. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడంతో పాటు... హెయిర్ డ్యామేజ్ కూడా తగ్గిస్తుంది. జుట్టును చాలా మృదువుగా చేస్తుంది.
ఇంట్లో హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి..?
ఒక చిన్న గిన్నెలో కొబ్బరి నూనెను మీకు ఎంత అవసరమో అంత తీసుకొని వేడి చేయాలి. అందులో కావాలంటే కరివేపాకు, మెంతులు వేసుకోవచ్చు. ఆ నూనెను తలతో పాటు జుట్టుకు మంచిగా మసాజ్ చేయాలి.
వెచ్చని నూనెతో మీ నెత్తిని మసాజ్ చేసినప్పుడు, అది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు మెరుగైన రక్త ప్రసరణ అవసరం. రక్త ప్రసరణ పెరగడం వల్ల జుట్టు కుదుళ్లకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలు లభిస్తాయి. ఇది మూలాలను బలపరచడమే కాకుండా, కొత్త జుట్టు పెరుగుదలను కూడా ప్రేరేపిస్తుంది.

