Face Glow: ఇవి రాస్తే.. మీ ముఖంపై ముడతలు తగ్గి, యవ్వనంగా మెరిసిపోతారు..!
ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ఇలా ముఖంపై ముడతల సమస్యతో బాధపడుతున్నారు. దీనిని కవర్ చేయానికి చాలా మంది మేకప్ ని ఆశ్రయిస్తారు. కానీ, కెమికల్స్ తో నిండి ఉండే మేకప్ ముఖాన్ని మరింత ఎక్కువగా డ్యామేజ్ చేసేస్తాయి.

ముడతలు పోగొట్టాలంటే ఏం చేయాలి?
వయసు పెరిగే కొద్దీ.. ముఖంపై ముడతలు, ఫైన్ లైన్స్ లాంటివి రావడం చాలా సహజం. ఒక్కసారి ముడతలు రావడం మొదలయ్యాయి అంటే.. ముఖంలో అందం తగ్గడం మొదలౌతుంది. ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే ఇలా ముఖంపై ముడతల సమస్యతో బాధపడుతున్నారు. దీనిని కవర్ చేయానికి చాలా మంది మేకప్ ని ఆశ్రయిస్తారు. కానీ, కెమికల్స్ తో నిండి ఉండే మేకప్ ముఖాన్ని మరింత ఎక్కువగా డ్యామేజ్ చేసేస్తాయి. అలా వాటితో అవసరం లేకపోయినా.. సహజంగా అందంగా మెరిసిపోవచ్చు. దాని కోసం ముఖానికి ఏం రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
1.కలబంద, విటమిన్ ఈ క్యాప్సిల్స్..
కలబంద, విటమిన్ ఈ క్యాప్సిల్స్ రెండూ కలిపి ముఖానికి రాస్తే... అందంగా మెరిసిపోవచ్చు. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో, చర్మానికి మెరుపును తీసుకురావడంలో సహాయపడతాయి. తాజా కలబంద ఆకుల నుంచి జెల్ ని తీసి, అందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ లో ఉన్న ఆయిల్ కూడా వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మంచిగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత.. ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
2. పసుపు, పాలు ఫేస్ ప్యాక్...
పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పాలలో లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా, మృదువుగా చేయడంలో సహాయపడతాయి. పసుపు, పాలు కలిపి పేస్టులా చేసి ముఖంపై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ముఖంలో గ్లో వచ్చేస్తుంది.
నారింజ తొక్క పొడి
నారింజ తొక్క చర్మం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మంపై మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నారింజ తొక్కను ఎండబెట్టి పొడిగా చేసి, అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖంపై అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
విటమిన్ E
విటమిన్ E ముఖానికి ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ,ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు విటమిన్ E క్యాప్సూల్స్ నుండి నూనెను ముఖంపై అప్లై చేయవచ్చు. మీరు విటమిన్ E క్యాప్సూల్స్‌ను కలబంద జెల్ లేదా కొబ్బరి నూనెతో కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు.
వీటితో పాటు... ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీరు త్రాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల చర్మంపై ముడతలు వచ్చే సమస్య క్రమంగా తగ్గుతుంది.కృత్రిమ తీపి పదార్థాలు అధికంగా ఉండే బేకరీ స్వీట్లు ,శీతల పానీయాలు వంటి ఆహారాలు,పానీయాలను నివారించండి.ఎందుకంటే ఈ ఆహారాలు చర్మం ముడతలు పడటానికి ,అకాల వృద్ధాప్యానికి కారణమవుతాయి.వేయించిన ఆహారాన్ని వీలైనంత వరకు నివారించండి.ప్రాసెస్ చేసిన మాంసాలు ,ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను నివారించండి.