అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, కురులు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.
సాల్మన్ లాంటి కొవ్వు అధికంగా ఉండే చేపల్లో ఒమేగా-3, ప్రోటీన్, విటమిన్-డి పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా మారుతుంది.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సాయపడతాయి.
గుడ్లలో బయోటిన్‌తో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ గుడ్డు తినడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగవుతుంది.
పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్-ఎ, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇది మీ స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచి, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సాయపడుతుంది.
పప్పుధాన్యాలలో పోషకాలు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా అవసరం.
బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, సెలీనియం ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఒత్తుగా పెరగడానికి సాయపడతాయి.
Silver Anklets: వర్కింగ్ ఉమెన్స్ కోసం సింపుల్ డిజైన్ లో వెండి పట్టీలు
Pearl Earrings: ముత్యాల ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
Trending Anklets: పాదాలకు కొత్త మెరుపునిచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో
Wedding Anklets: పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం హెవీ డిజైన్ పట్టీలు.. ఇవిగో