- Home
- Life
- Woman
- Gold Polish Hacks: నల్లబడిన నగలు నిమిషాల్లో మెరిసిపోవాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి!
Gold Polish Hacks: నల్లబడిన నగలు నిమిషాల్లో మెరిసిపోవాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి!
Gold Polish Hacks: మీ బంగారు నగలు మెరుపు కోల్పోయాయా? షాపుకు వెళ్లే పనిలేకుండా, మీ వంటింట్లో ఉండే టూత్‌పేస్ట్‌తో మ్యాజిక్ చేయొచ్చు. పాత నగలు మళ్లీ షోరూమ్ పీసుల్లా మెరుస్తాయి.

5 నిమిషాల్లో కొత్త వాటిలా..
బంగారు ఆభరణాలు అంటే మహిళలకు ప్రాణం. అయితే రోజూ వాడటం వల్ల లేదా గాలిలోని తేమ, చెమట వల్ల బంగారం తన మెరుపును కోల్పోయి నల్లగా లేదా కిలుము పట్టేసినట్లు కనిపిస్తుంది. వీటిని క్లీన్ చేయించడానికి ప్రతిసారీ జ్యువెలరీ షాపుకో, కారీగార్ల దగ్గరకో వెళ్లాల్సిన పనిలేదు. మీ ఇంట్లో ఉండే టూత్‌పేస్ట్ సహాయంతో కేవలం 5 నిమిషాల్లో వాటిని కొత్తవాటిలా మెరిపించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
శుభ్రం చేసే విధానం
కావలసిన వస్తువులు: తెల్లటి టూత్‌పేస్ట్, మెత్తని పాత టూత్ బ్రష్, గోరువెచ్చని నీరు, మెత్తని కాటన్ క్లాత్
ముందుగా మీ బంగారు నగపై కొంచెం టూత్‌పేస్ట్‌ను రాయండి. నగ మొత్తం కవర్ అయ్యేలా చూడండి. మెత్తని బ్రష్‌ను కొంచెం నీటిలో ముంచి, నగపై చాలా నెమ్మదిగా వృత్తాకారంలో రుద్దండి. నగల డిజైన్ల మధ్యలో ఉన్న మురికిని వదిలించడానికి బ్రష్ బాగా ఉపయోగపడుతుంది. గట్టిగా రుద్దకండి, దీనివల్ల నగపై గీతలు పడే అవకాశం ఉంటుంది.
కాటన్ క్లాత్‍తో తుడవండి
ఎక్కువ మురికి ఉంటే, పేస్ట్ రాసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో నగను శుభ్రంగా కడగండి. పేస్ట్ ఎక్కడా మిగిలి ఉండకుండా చూసుకోండి. చివరగా ఒక మెత్తని పొడి కాటన్ క్లాత్‍తో తుడవండి. అంతే మీ పాత నగలు కొత్తవాటిలా తళతళలాడుతుంటాయి.
జాగ్రత్త అవసరం
ముత్యాలు, పగడాలు లేదా అతికించిన రాళ్లు ఉన్న నగలపై ఇలా చేయకపోవడమే మంచిది. టూత్‌పేస్ట్ వల్ల ఆ రాళ్ల మెరుపు తగ్గే అవకాశం ఉంది. కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే ఇది ఉత్తమం. బ్లీచింగ్ లేదా స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్న పేస్టులను అస్సలు వాడకండి.

