MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Biscuits: బంగారాన్ని ఆభరణాలుగా కొంటే లాభమా లేక గోల్డ్ బిస్కెట్లలా కొంటే మంచిదా?

Gold Biscuits: బంగారాన్ని ఆభరణాలుగా కొంటే లాభమా లేక గోల్డ్ బిస్కెట్లలా కొంటే మంచిదా?

Gold Biscuits: బంగారు ధరలు గత కొనేళ్లతో పోలిస్తే భారీగా పెరిగిపోయాయి. అయితే ఏ రూపంలో బంగారం కొనాలో తెలియక ఎంతో మంది సతమవుతారు. బంగారు ఆభరణాలుగా లేక గోల్డ్ బిస్కెట్ రూపంలో.. ఎలా బంగారం కొనాలో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 20 2026, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బంగారం ఏ రూపంలో కొనాలి?
Image Credit : Getty

బంగారం ఏ రూపంలో కొనాలి?

దేశంలో బంగారం ధరలు రోజు రోజుకీ పెరుగుతుండటంతో చాలా మంది ఒకే ప్రశ్న వేధిస్తోంది. ఇప్పుడు బంగారం కొనాలా వద్దా? కొంటే ఆభరణాలు తీసుకోవాలా? లేక బంగారు బిస్కెట్ కొనడం బెటరా? అని ఎంతో మంది సతమతమవుతున్నారు. నిజానికి బంగారం అంటే మనకు ఎప్పటి నుంచో సేఫ్ పెట్టుబడి అనేన నమ్మకం ఉంది. డబ్బు విలువ తగ్గినా, బంగారం మాత్రం తన విలువను కాపాడుకుంటూనే వస్తోంది. అందుకే చాలా మంది తమ సేవింగ్స్‌లో కొంత భాగాన్ని బంగారంగా మార్చాలని అనుకుంటారు. కానీ ఎలా కొనాలి అనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. ఇదే సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే, లాభం రావాల్సిన చోట నష్టం కూడా రావచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బంగారు ఆభరణాలు
Image Credit : Getty

బంగారు ఆభరణాలు

ముందుగా ఆభరణాల గురించి మాట్లాడితే… మన భారతీయులకు బంగారు ఆభరణాలు అంటే చా ఇష్టం. పెళ్లిళ్లు, పండుగలు, ఫంక్షన్ల సమయంలో మెడలో బంగారు ఆభరణాలు వేసుకోవడం తప్పనిసరి. అందుకే చాలా మంది బంగారం అంటే ముందుగా జ్యువెలరీ గురించే ఆలోచిస్తారు. కానీ పెట్టుబడి కోణంలో చూస్తే ఆభరణాలు అంతగా ఉపయోగపడవు. ఎందుకంటే మీరు ఆభరణం కొనుగోలు చేసే సమయంలో మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ వంటి అదనపు ఖర్చులు చెల్లించాలి. ఇవి కొన్నిసార్లు బంగారం విలువలోనే 10 శాతం నుంచి 20 శాతం వరకు ఉండొచ్చు. కానీ మీరు ఆ ఆభరణాన్ని తిరిగి అమ్మేటప్పుడు ఈ ఛార్జీలు తిరిగి రావు. దీంతో బంగారం ధర పెరిగినా, మీకు ఆశించినంత లాభం కనిపించకపోవచ్చు. కాబట్టి కేవలం పెట్టుబడి కోసం ఆభరణాలు కొనడం అంత మంచిది కాదు.

Related Articles

Related image1
Money in Dreams: కలలో డబ్బులు ఎలా కనిపిస్తే అదృష్టం? డబ్బు పోయినట్టు కనిపిస్తే ఏం జరుగుతుంది?
Related image2
Cost of Living: మనదేశంలో నెలకు ఎంత జీతం వస్తే ఒక కుటుంబం సంతోషంగా జీవించగలదో తెలుసా?
34
బంగారు బిస్కెట్లు
Image Credit : Getty

బంగారు బిస్కెట్లు

ఇక బంగారు బిస్కెట్లు లేదా గోల్డ్ బార్స్ విషయానికి వస్తే… ఇవి పూర్తిగా పెట్టుబడి కోసం డిజైన్ చేసినవే అని చెప్పొచ్చు. బిస్కెట్లలో మేకింగ్ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే మీరు పెట్టిన డబ్బు దాదాపు పూర్తిగా బంగారం విలువగానే ఉంటుంది. బంగారం ధర పెరిగితే దాని లాభం నేరుగా మీకే వస్తుంది. అమ్మాలనుకున్నప్పుడు కూడా చాలా సులభంగా అమ్మేయొచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. వీటిని సేఫ్‌గా ఉంచుకోవాలి. ఇంట్లో ఉంచితే సెక్యూరిటీ సమస్యలు ఉండొచ్చు. కాబట్టి బ్యాంక్ లాకర్ లేదా సురక్షిత ప్రదేశం అవసరం అవుతుంది. ఇదొక చిన్న ఇబ్బంది అయినా, పెట్టుబడి కోణంలో చూస్తే ఇది మంచి ఆప్షన్‌గా భావిస్తారు.

44
ఏది కొంటే బెటర్?
Image Credit : Getty

ఏది కొంటే బెటర్?

మీరు బంగారం ఎందుకు కొనాలనుకుంటున్నారు అనేది క్లియర్‌గా ఒక అభిప్రాయానికి రండి. మీరు ధరించడానికి, ఫ్యాషన్ కోసం కొనాలనుకుంటే ఆభరణాలు తీసుకోవడం సరైన నిర్ణయం. కానీ పెట్టుబడి కోసం అనకుంటే బంగారు బిస్కెట్లు లేదా గోల్డ్ బార్స్ తీసుకోవడం మంచిది. ఇంకా ఇప్పుడు డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్స్ వంటి కొత్త ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తొందరపడకుండా, మీ అవసరం, మీ బడ్జెట్ బట్టి ప్లాన్ చేసి కొనండి. సరైన విధంగా బంగారం కొనుగోలు చేస్తే భవిష్యత్తులో అది మంచి లాభాన్ని ఇస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
బంగారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
ఇండియాలో ఇంటర్నేషనల్ పత్రికలు.. సింగపూర్ సంస్థతో ఆశ్రయు మీడియా ఒప్పందం
Recommended image2
Today Gold Rate: బంగారం ధరలకు బ్రేక్.. ఈరోజు ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image3
Gold Price Hike: అమెరికా-ఇరాన్ యుద్ధం శాంతించినా...ఏమాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు
Related Stories
Recommended image1
Money in Dreams: కలలో డబ్బులు ఎలా కనిపిస్తే అదృష్టం? డబ్బు పోయినట్టు కనిపిస్తే ఏం జరుగుతుంది?
Recommended image2
Cost of Living: మనదేశంలో నెలకు ఎంత జీతం వస్తే ఒక కుటుంబం సంతోషంగా జీవించగలదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved