Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Gold Jewellery: బంగారు ధరలు పెరిగిపోయాయి. కాబట్టి అందరూ కొనలేదు. కానీ బంగారు ఆభరణాలు అద్దెకు ఇచ్చే వ్యాపారం పెరిగిపోయింది. ఈ వ్యాపారంలో నెలకు లక్షల రూపాయలు సులువుగా సంపాదించేయవచ్చు.

బంగార ధరలు పెరిగిపోవడంతో
ఇప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజురోజుకు బంగారం గ్రాము ధర పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు బంగారు ఆభరణాలు కొనడం కష్టమైపోయింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, రిసెప్షన్లు వంటి వేడుకల సమయంలో బంగారు ఆభరణాలు అవసరం. నీ లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆభరణాలు కొనడం అందరికీ సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లోనే అద్దెకు బంగారు ఆభరణాలు ఇచ్చే వ్యాపారం వేగంగా పెరిగిపోతోంది. అవసరానికి తగినట్లుగా తక్కువ ఖర్చుతో బంగారు నగలు ధరించే అవకాశం రావడంతో చాలా మంది ఈ వ్యాపారం మొదలుపెట్టేస్తున్నారు.
అద్దెకు బంగారు ఆభరణాలు
అద్దె బంగారు ఆభరణాల వ్యాపారంలో పెళ్లి సెట్లు, నెక్లెస్‌లు, హారాలు, కమ్మలు, వడ్డాణాలు, చేతి కడియాలు వంటి ఎన్నో డిజైన్లు అందుబాటులో ఉంటున్నాయి. పెళ్లికూతురుకు సంప్రదాయ డిజైన్, రిసెప్షన్‌కు మోడ్రన్ డిజైన్, ఫంక్షన్లకు లైట్ వెయిట్ ఆభరణాలు ఇలా సందర్భానికి తగ్గట్లు ఆభరణాలు ఎంపిక చేసుకోవచ్చు. సాధారణంగా ఆభరణాల అసలు ధరలో 5 నుంచి 10 శాతం వరకు అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. రెండు లేదా మూడు రోజుల పాటు ధరించడానికి ఈ నగలను అద్దెకు ఇస్తారు. దీంతో లక్షల రూపాయలను అద్దెగా తీసుకుంటారు కాబట్టి నెలకు ఆదాయం అధికంగానే ఉంటుంది. పైగా మీ నగలు మీ దగ్గరే ఉంటాయి.
ఎంతో లాభమైన వ్యాపారం
ఈ వ్యాపారం అద్దెకు తీసుకున్నవారికే కాదు,వ్యాపారులకు కూడా లాభదాయకంగా మారింది. బంగారం కొనుగోలు చేసి అమ్మడం కంటే, ఒకసారి కొనుగోలు చేసిన ఆభరణాలను ఎన్నిసార్లైనా అద్దెకు ఇవ్వవచ్చు. దీనివల్ల స్థిరమైన ఆదాయం వస్తోంది. ముఖ్యంగా పెద్ద నగరాల్లోనే కాకుండా, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ట్రెండ్ నెమ్మదిగా విస్తరిస్తోంది. కొన్ని జ్యువెలరీ షాపులు ప్రత్యేకంగా అద్దె విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. మరికొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఈ సేవలను అందిస్తున్నాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
అద్దెకు బంగారు ఆభరణాలు తీసుకునే వారు, ఇచ్చే వారు కూడా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అద్దెకు బంగారు ఆభరణాలు ఇక్చేవారు భద్రతా డిపాజిట్ గా అధిక మొత్తంలో తీసుకోవాలి. ఆభరణాలు దెబ్బతినకుండా, బరువు తగ్గకుండా జాగ్రత్తగా వాడాలనే ఒప్పందం కూడా చేసుకోవాలి. నగలను అద్దెకు తీసుకున్నవారు ఆభరణాలకు ఎలాంటి నష్టం జరిగినా అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. అలాగే అద్దెకు నగలు ఇచ్చిన వారు ఆభరణాలు అసలైనవేనా? నకిలీవా అనే విషయం నిర్ధారించుకోవడం ముఖ్యం.
భవిష్యత్తులో భారీ వ్యాపారం
మొత్తంగా చూస్తే బంగారం ధరలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో అద్దెకు బంగారు ఆభరణాలు తీసుకునే పద్దతి సామాన్యులకు ఒక మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఖర్చు తగ్గడం, ట్రెండ్‌కు తగ్గ డిజైన్లు ధరించే అవకాశం రావడం వంటి కారణాలతో ఈ వ్యాపారం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో పెళ్లిళ్లు, వేడుకల ప్రపంచంలో అద్దె బంగారం సాధారణ విషయం అయిపోతుంది. ఇప్పటికే రిసెప్షన్ బట్టలు అద్దెకు ఇచ్చే వ్యాపారం సాగుతోంది.

