Face Glow: ఈ ఐదు గింజలు కలిపి రోజూ తింటే... ఖరీదైన క్రీములతో పనేలేదు..!
Face Glow: ముఖంపై ఎలాంటి ముడతలు లేకుండా అందంగా కనిపించాలంటే మార్కెట్లో దొరికే క్రీములే రాయాల్సిన అవసరం లేదు. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉన్న ఆహారం తీసుకున్నా చాలు అనే విషయం మీకు తెలుసా?

Skin Care
వయసు పెరుగుతున్నా కూడా ముఖం మెరుస్తూ కనిపించాలి అంటే.. ఆ గ్లో పైపైన రాసే క్రీములతో కాకుండా... లోపలి నుంచి రావాలి. అలా లోపలి నుంచి మన అందాన్ని పెంచే కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. అవి రోజూ తింటే సరిపోతుంది.
చియా సీడ్స్....
చియా సీడ్స్ చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ చాలా శక్తివంతమైనవి. చర్మాన్ని అందంగా మార్చడంలో ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల... చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఈ చియా సీడ్స్ లో నీటిని నానపెట్టి తీసుకుంటాం. నీటిలో నానపెట్టడం వల్ల అది జెల్ లాగా మారుతుంది. ఇలా జెల్ గా మారిన తర్వాత తీసుకోవడం వల్ల.. చర్మాన్ని మంచిగా హైడ్రేటెడ్ గా మారుస్తుంది. స్కిన్ చాలా మృదువుగా, అందంగా కనపడుతుంది. అయితే... మంచిది కదా అని... వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లకు మించి వీటిని తీసుకోకూడదు.
అవిసె గింజలు...
అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవ జీర్ణక్రియకు సహాయం చేస్తాయి. హార్మోన్లను బ్యాలెన్స్డ్ గా ఉంచుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవన్నీ... చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. ఈ అవిసె గింజలను మీరు పొడి రూపంలో చేసి కూడా తీసుకోవచ్చు.
గుమ్మడి గింజలు...
చర్మాన్ని అందంగా మార్చడానికి, మొటిమల సమస్యను తగ్గించడానికి కూడా గుమ్మడి గింజలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాదు... ఈ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల యవ్వనంగా కనిపిస్తారు. ఇందులో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
పొద్దు తిరుగుడు విత్తనాలు..
పొద్దు తిరుగుడు గింజలు కూడా మీ చర్మాన్ని మెరిసేలా చేయడానికి సహాయపడతాయి. ఈ గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలో గ్లో పెరగడానికి సహాయం చేస్తుంది. అంతేకాదు.... వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా మార్చడానికి హెల్ప్ చేస్తాయి.
నువ్వులు....
చర్మ సంరక్షణ విషయానికి వస్తే నువ్వులు, ముఖ్యంగా నల్ల నువ్వులు చాలా బాగా సహాయం చేస్తాయి. ఈ నువ్వుల్లో కాల్షియం, రాగి , సెసామిన్ , సెసామోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి , కొల్లాజెన్‌ను సంరక్షించడానికి సహాయపడతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి బాగుంటే.. చర్మం అందంగా కనపడుతుంది
ఈ ఐదు గింజలను ఎలా తీసుకోవాలి..?
ప్రతిరోజూ....
2 టేబుల్ స్పూన్లు గుమ్మడికాయ గింజలు
2 టేబుల్ స్పూన్లు పొద్దుతిరుగుడు విత్తనాలు
1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్
1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు
1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలి. వీటిని ఉదయం పూట స్మూతీలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే.. ఈ గింజలను లైట్ గా వేడి చేసి పౌడర్ లా చేసి అయినా తీసుకోవచ్చు. చియా సీడ్స్ మాత్రం నీటిలో నానపెట్టి.. తాగాలి. కనీసం రెండు గంటలు అయినా ఆ గింజలను నీటిలో నాననివ్వాలి. ప్రతిరోజూ వీటిని తీసుకుంటే... కచ్చితంగా మీరు యవ్వనంగా, అందంగా కనపడతారు. అందంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.