MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Woman
  • Skin Care: చిటికెడు ఇది ముఖానికి రాసినా...మీ ముఖం మెరిసిపోవడం పక్కా..!

Skin Care: చిటికెడు ఇది ముఖానికి రాసినా...మీ ముఖం మెరిసిపోవడం పక్కా..!

గంధాన్ని ఉపయోగించడం వల్ల చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా మారడమే కాకుండా.. మొటిమల సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 28 2025, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సహజంగా అందంగా మెరిసేదెలా
Image Credit : Getty

సహజంగా అందంగా మెరిసేదెలా

అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దాని కోసం మార్కెట్లో దొరికే చాలా రకాల క్రీములు ముఖానికి పూసేస్తూ ఉంటారు. వాటి వల్ల అందం పక్కన పెడితే... ముఖం మరింత డ్యామేజ్ అయిపోతుంది. అలా కాకుండా.. మనకు చాలా సులభంగా లభించే కేవలం రెండింటిని వాడి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు చూద్దాం...

చర్మ సంరక్షణలో గంధానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన కాలం నుంచే దీన్ని సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు. గంధాన్ని ఉపయోగించడం వల్ల చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా మారడమే కాకుండా.. మొటిమల సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. గంధంలో సహజ శీతలీ గుణాలు ఉంటాయి. అవి.. మన చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. ఈ గంధాన్ని ముఖానికి ఎలా వాడాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గంధంతో ఫేస్ ప్యాక్...
Image Credit : stockPhoto

గంధంతో ఫేస్ ప్యాక్...

గంధపు ఫేస్ ప్యాక్‌ను అలొవెరా జెల్‌తో కలిపి ఉపయోగిస్తే అందం రెట్టింపు అవుతుంది. అలొవెరా జెల్‌లో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు మొటిమల సమస్యను తగ్గిస్తాయి. అలాగే రోజ్ వాటర్ కలపడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా మారి, ముఖం మృదువుగా మారుతుంది. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వాడడం వల్ల చర్మం డీప్ గా క్లీన్ అవుతుంది.

34
గంధం-కలబంద ఫేస్ ప్యాక్ తయారీ విధానం
Image Credit : Getty

గంధం-కలబంద ఫేస్ ప్యాక్ తయారీ విధానం

మొదట ఒక గిన్నెలో రెండు టీస్పూన్లు గంధపు పొడి వేసి, దానిలో ఒక టీస్పూన్ అలొవెరా జెల్ , ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు జోడించి మిశ్రమాన్ని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తర్వాత బ్రష్ లేదా వేళ్ల సహాయంతో ఈ ప్యాక్‌ను ముఖంపై సమానంగా రాయాలి. అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. తరువాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

గంధపు ఫేస్ ప్యాక్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ ప్యాక్ వాడటం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గడమే కాకుండా సన్‌బర్న్ వల్ల వచ్చే ఎరుపు కూడా తగ్గుతుంది. మొటిమల సమస్య కూడా పూర్తిగా తగ్గుతుంది. అలొవెరా జెల్ చర్మాన్ని హీలింగ్ చేయడం వల్ల గాయాలు లేదా చిన్న మచ్చలు మాయమవుతాయి. రోజ్ వాటర్ కలపడం వల్ల చర్మం తేమతో నిండిపోతుంది. ఈ మిశ్రమం వాడిన తర్వాత చర్మం ప్రకాశవంతంగా మారి సహజ కాంతిని ఇస్తుంది.

44
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Image Credit : Getty

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

గంధపు పొడి ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారు గంధపు పొడిని జాగ్రత్తగా వాడాలి. లేకపోతే పొడిబారే ప్రమాదం ఉంటుంది. గంధపు పొడి ఆరిన తర్వాత బలంగా రుద్దకూడదు, ఎందుకంటే అది చర్మంపై ముడతలను కలిగించే అవకాశం ఉంది. ఏదైనా కొత్త పదార్థాన్ని గంధంతో కలపాలనుకుంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఫైనల్ గా...

గంధపు ఫేస్ ప్యాక్ అనేది సహజమైన సౌందర్య రహస్యం. దీన్ని వారానికి ఒకసారి వాడటం ద్వారా చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది. సూర్యరశ్మి వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో ఇది అద్భుత ఫలితాలను ఇస్తుంది. సహజమైన ఈ ప్యాక్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల రసాయనాలపై ఆధారపడకుండా సులభంగా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Related Stories
Recommended image1
Face Glow: వర్షాకాలంలో ఈ ఒక్క క్రీమ్ రాసినా... ముఖం మెరిసిపోతుంది..!
Recommended image2
Beauty tips: మిగిలిన పెరుగును ఇలా వాడితే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved