Periods: పీరియడ్స్ సమయంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఏ రంగు డ్రెస్సులు వేసుకోవాలి?
కొంత మంది మహిళలు పీరియడ్స్ సమయంలో నలుపు వంటి ముదురు రంగులను ధరించడానికి ఇష్టపడతారు. పొరపాటున పీరియడ్ బ్లడ్ లీక్ అయినా.. ముదురు రంగు దుస్తులు అయితే.. ఆ మరకలు కనపడవు అని అనుకుంటారు.

పీరియడ్స్ గురించి ఈ విషయం తెలుసా?
మహిళలకు పీరియడ్స్ ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. ఇది చాలా సహజ ప్రక్రియ అయినప్పటికీ, చాలా మందికి ఇది నొప్పి, అసౌకర్యంతో కూడిన సమయం అని చెప్పొచ్చు. పీరియడ్స్ లో చాలా మందికి విపరీతమైన కడుపులో నొప్పి, నడుము నొప్పి,శరీరంలో వాపు లాంటి సమస్యలు వస్తాయి. అయితే.. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, మనం ఎంచుకునే దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత మంది మహిళలు పీరియడ్స్ సమయంలో నలుపు వంటి ముదురు రంగులను ధరించడానికి ఇష్టపడతారు. పొరపాటున పీరియడ్ బ్లడ్ లీక్ అయినా.. ముదురు రంగు దుస్తులు అయితే.. ఆ మరకలు కనపడవు అని అనుకుంటారు. కానీ, మనం కొన్ని రంగుల దుస్తులు ధరించడం వల్ల పీరియడ్స్ లో చాలా ఉపశమనం లభిస్తుంది. మరి, ఎలాంటి ఎంచుకోవాలో తెలుసుకుందాం..
సౌకర్యవంతమైన దుస్తులు...
పీరియడ్స్ సమయంలో శరీర సున్నితత్వం పెరుగుతుంది. కాబట్టి, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల కడుపులో నొప్పి మరింత పెరుగుతుంది. కాబట్టి, బిగుతుగా ఉండే దుస్తులకు బదులుగా, వదులుగా ఉండే గాలి పీల్చుకునేలా ఉండే దుస్తులు ఎంచుకోవడం మంచిది.
ఎలాంటి దుస్తులు ఎంచుకోవాలి?
కాటన్ కుర్తా లేదా దుస్తులు - ఇది శరీరం నుండి చెమటను గ్రహిస్తుంది. చర్మపు చికాకును నివారిస్తుంది.
వదులుగా ఉండే స్కర్ట్ లేదా ప్యాంటు ఎంచుకోవాలి. ఇవి పొట్టమీద ఒత్తిడి లేకుండా చూసుకుంటుంది.
ఋతుస్రావం సమయంలో నివారించాల్సిన దుస్తులు:
బిగుతు జీన్స్ లేదా లెగ్గింగ్స్ - కడుపు నొప్పిని పెంచుతాయి.
సింథటిక్ బట్టలు - తేమను పెంచుతాయి. చర్మపు చికాకును కలిగిస్తాయి.
మరి ఎలాంటి రంగులు ఎంచుకోవాలి?
మనం ధరించే దుస్తుల రంగులు మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. ఋతుస్రావం సమయంలో ప్రశాంతమైన రంగులను ఎంచుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా తెలుపు లేదా లేత రంగులు ఎంచుకోవాలి. ఇవి మనసుకు హాయిగా అనిపిస్తాయి. అంతేకాదు.. నీలం, ఆకుపచ్చ రంగులు ఎంచుకోవాలి. ఇవి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. నలుపు, బూడిద రంగులు ఎంచుకుంటే మరకల భయం ఉండదు.
ఏ రంగులను నివారించాలి?
ఎరుపు - ఒత్తిడిని పెంచుతుంది.
ఊదా/గులాబీ - భావోద్వేగాలను రేకెత్తించగలదు.
లోదుస్తుల ఎంపిక:
ఋతుస్రావం సమయంలో కాటన్ లోదుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇవి తేమను గ్రహిస్తాయి, చర్మపు చికాకును నివారిస్తాయి. అలాగే, సౌకర్యవంతమైన పరిమాణంలో లోదుస్తులను ధరించడం మంచిది.