Face Glow: రోజూ ముఖానికి ఆముదం రాస్తే ఏమౌతుంది?
Castor Oil: ఆముదంలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు.. ఫైన్ లైన్స్, ముడతలు రాకుండా కాపాడతాయి.

ఆముదంతో అందం..
ఆముదం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పూర్వం.. ఈ ఆముదాన్ని చాలా మంది జుట్టుకు రాసేవారు.ఎందుకంటే... ఈ నూనె జుట్టు కుదుళ్లను ఒత్తుగా మార్చడానికి, నల్లగా నిగనిగలాడటానికి సహాయపడేది. కానీ, ఇదే ఆముదం మన చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని మీకు తెలుసా.? ఈ నూనె ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. ఆముదంలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు.. ఫైన్ లైన్స్, ముడతలు రాకుండా కాపాడతాయి. మరి, మన అందాన్ని పెంచుకోవడానికి ఈ ఆముదాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం...
KNOW
ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి...
మనం ఆముదాన్ని ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. కొద్దిగా ఆముదం నూనె తీసుకొని, అందులో జోజొబా నూనె కలపాలి. ఈ రెండు నూనెలను బాగా కలిపి.. ముఖానికి మంచిగా రాసి మంచిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల.. మనం రెగ్యులర్ గా వేసుకునే మేకప్ తొలగించడంతో పాటు.. మురికిని కూడా చాలా ఈజీగా తొలగించవచ్చు. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
పెదాలను అందంగా మార్చే ఆముదం...
చాలా మందికి సీజన్ తో సంబంధం లేకుండా పెదాలు పగిలిపోతూ ఉంటాయి. అలాంటివారు ఆముదం నూనెతో ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. దీనిలో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉండటం వల్ల.. దీనిని మనం లిప్ బామ్ లాగా వాడొచ్చు. దీనికోసం ఆముదంలో కొంచెం తేనె, షియా బటర్ వేసి బాగా కలపాలి. దీనిని ఏదైనా కంటైనర్ లో స్టోర్ చేసుకొని.. రోజూ పెదాలకు రాస్తే సరిపోతుంది. ఇది.. మీ పెదాలను అందంగా, మృదువుగా మారుస్తాయి.
యవ్వనంగా మార్చే సీరమ్..
మీరు ఆముదం సహాయంతో గొప్ప యాంటీ ఏజింగ్ సీరం తయారు చేయవచ్చు. ఆముదంలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతాయి. దీని కోసం, లావెండర్ నూనెతో ఆముదం నూనెను కలపండి. ఇప్పుడు రాత్రిపూట సీరంలా అప్లై చేయండి, ఇది ఫైన్ లైన్స్ , ముడతలను తొలగిస్తుంది. పిగ్మెంటేషన్ సమస్య కూడా తగ్గుతుందని.. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లోనూ ప్రచురించారు.
క్యూటికల్ ఆయిల్‌గా ఉపయోగించండి
ఆముదం చర్మాన్ని మాత్రమే కాకుండా గోళ్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇది గోళ్ల పెరుగుదల , ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కోసం, మీరు చేయాల్సిందల్లా ఆముదం నూనెను కొద్ది మొత్తంలో తీసుకొని చేతి గోళ్లను మసాజ్ చేయాలి. అయితే.. ఈ నూనెను చర్మానికి ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్టు కచ్చితంగా చేసుకోవాలి. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు.