- Home
- Life
- Woman
- Sloka Ambani: ఆస్తి కాదు, తన పిల్లలకు వారసత్వంగా అంబానీ కోడలు ఏం ఇవ్వాలని అనుకుంటుందో తెలుసా?
Sloka Ambani: ఆస్తి కాదు, తన పిల్లలకు వారసత్వంగా అంబానీ కోడలు ఏం ఇవ్వాలని అనుకుంటుందో తెలుసా?
అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా కి పరిచయం అవసరం లేదు. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పిల్లలకు ఎలాంటి వారసత్వం ఇవ్వాలని అనుకుంటున్నారో వివరించారు.
- FB
- TW
- Linkdin
Follow Us

అంబానీ కోడలు..
మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీకి పరిచయం అవసరం లేదు. అంబానీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ వారి వ్యాపారానికి సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్నవారే. అయితే.. అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా మాత్రం.. ఓ ఎన్జీఓ నిర్వహిస్తోంది. దాని పేరే ‘ కనెక్ట్ ఫర్’ అసలు ఆమె ఈ ఎన్జీఓ ని ఎందుకు స్థాపించారు? దాని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం...
ఇంటర్వ్యూలో శ్లోకా ఏం చెప్పింది?
ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మసూమ్ మినావాలా యూట్యూబ్ ఛానల్ కీ శ్లోకా మెహతా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో, ఆమె తన ఎన్జీఓ కనెక్ట్ ఫర్ గురించి మాత్రమే కాకుండా.. తన వ్యక్తిగత జీవితం, తల్లిగా తన బాధ్యతలు, భవిష్యత్తులో తాను తన పిల్లలకు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అనే విషయాల గురించి మాట్లాడారు.
‘కనెక్ట్ ఫర్’ అంటే ఏమిటి?
2015లో మానితి షాతో కలిసి శ్లోకా ‘కనెక్ట్ ఫర్’ అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించారు. ఇది వనరులు తక్కువగా ఉన్న ఎన్జీఓలకు అవసరమైన స్వచ్ఛందాలు, నైపుణ్యాలు, ఇతర సహాయ వనరులను అందించే వేదికగా పనిచేస్తోంది. సేవా భావాన్ని టెక్నాలజీ ద్వారా మరింత విస్తరించాలన్న దృష్టితో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది.
కనెక్ట్ ఫర్ – ఉద్యోగమా లేక వారసత్వమా?
ఇది తనకో ఉద్యోగం మాత్రమే కాకుండా, పిల్లలకు అందించదలచిన ఒక విలువైన వారసత్వమని శ్లోకా అంటారు. "అమ్మగా నేను ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, మీరు పాఠశాలకు వెళ్లాలి అని నా పిల్లలకు చెప్పడంలో గర్వపడతాను. మనమంతా ఎదుగుదల కోసం పని చేస్తున్నామన్న సందేశాన్ని నేను వారికి ఇవ్వాలనుకుంటున్నాను,” అని ఆమె పేర్కొన్నారు. “మీరు నిబద్ధతతో పనిచేస్తున్నప్పుడు, దానివల్ల ప్రభావితమయ్యే ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తీసుకురాగలుగుతారు. ఇదే ఉత్తమమైన వారసత్వం” అని దీనినే తాను ఎక్కువగా నమ్ముతుంటాను అని చెప్పారు.
కుటుంబాన్నీ, కెరీర్ ని బ్యాలెన్స్ చేయడం...
తాను ఇద్దరు పిల్లలకు తల్లిగా వారి బాగోగులు చూసుకుంటూ, ఇటు కెరీర్ పై ఫోకస్ పెట్టడానికి తన భర్త ఆకాష్ సహకారం ఎంతో ఉందని శ్లోకా చెప్పారు. “ఆయన నాకు అండగా ఉండటమే కాకుండా, నాకు ప్రేరణనిచ్చే వ్యక్తి,” అని పేర్కొన్నారు.